ఐఏఎస్ ఆఫీసర్ గా మారబోతున్న సాయిధరమ్ తేజ్  

Sai Dharam Tej become a IAS officer role in his movie, Tollywood, Telugu cinema, South cinema, mega Hero - Telugu Mega Hero, Sai Dharam Tej Become A Ias Officer Role In His Movie, South Cinema, Telugu Cinema, Tollywood

మెగా హీరో సాయి ధరంతేజ్ వరుస హిట్ సినిమాలతో మళ్లీ జోష్ లోకి వస్తున్నాడు.కెరియర్లో ఏకంగా డబుల్ హాట్రిక్ డిజాస్టర్ లు కొట్టిన సాయి ధరమ్ తేజ్ మరల చిత్రలహరి, ప్రతి రోజు పండగే సినిమాలతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు.

 Sai Dharam Tej Become A Ias Officer Role

ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉంది.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కథ నేటి యువతరానికి దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది.ఇదిలా ఉంటే సాయి ధరంతేజ్ తన నెక్స్ట్ సినిమాకి కూడా రెడీ అవుతున్నాడు.

ఐఏఎస్ ఆఫీసర్ గా మారబోతున్న సాయిధరమ్ తేజ్-Movie-Telugu Tollywood Photo Image

కెరియర్లో ప్రస్థానం లాంటి అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించిన దర్శకుడు దేవకట్టాతో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళుతున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కార్యక్రమం పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా కథ నార్త్ ఇండియా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది.

అలాగే సినిమాలో కథ పరంగా తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.ఇక సినిమా కథ కథనం పూర్తిగా దేవకట్ట స్టైల్లోనే ఉంటాయని, అయితే మాస్ ఎలిమెంట్స్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.

కరోనా సిచువేషన్ తగ్గిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం.

#Mega Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Dharam Tej Become A Ias Officer Role Related Telugu News,Photos/Pics,Images..