మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej )త్వరలోనే బ్రో సినిమా ( Bro Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈయన రోడ్డు ప్రమాదం తర్వాత తిరిగి కోలుకొని విరుపాక్ష సినిమా( Virupaksha Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో కలసి బ్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు లిరిక్స్ విడుదల చేశారు.
ఇందులో భాగంగా సాయిధరమ్ తేజ్ డాన్స్( Dance ) గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో సాయిధరమ్ తేజ్ ఈ విమర్శల గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

సాయి ధరమ్ తేజ్ మునపటిలాగా డాన్స్ చేయడం లేదని ఆయనలో ఆ జోష్ కనిపించడం లేదని విమర్శలు వచ్చాయి.ఈ విమర్శలపై స్పందించిన సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం తర్వాత తనకు పునర్జన్మ లభించిందని అయితే ఆ సమయంలో తనకు ఇచ్చిన మెడిసిన్స్, స్టెరాయిడ్స్ కారణంగా తన బాడీలో ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని తెలిపారు.తన డాన్స్ చూసి ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తాను నిరాశ పడ్డానని తెలిపారు.అయితే దీనిని నేను సాకుగా చెప్పను తప్పకుండా తిరిగి మునపటిలా డాన్స్ చేసి ప్రేక్షకులను సందడి చేస్తానని, కాకపోతే కొంత సమయం పడుతుందని ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.