'సాహో' వీకెండ్‌ కలెక్షన్స్‌ ఎంతో తెలుసా? ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకోవచ్చు

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ చిత్రంకు ఫ్లాప్‌ టాక్‌ వచ్చింది.మొదటి రోజు సోషల్‌ మీడియాలో మరీ దారుణమైన ఫ్లాప్‌ వచ్చింది.దాంతో కలెక్షన్స్‌ కనీసం 100 కోట్లు అయినా వచ్చేనా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు పర్వాలేదు అన్నట్లుగా ఓపెనింగ్స్‌ను రాబట్టింది.రెండవ రోజు నుండి చుక్కలే అంటే అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా సెలవు దినాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల మొదటి నాలుగు రోజుల పాటు సాహో కుమ్మేసింది.

 Sahoomovie Weekendcollections Kishore-TeluguStop.com

Telugu Sahoo, Sahooweekend, Sradha Kapoor, Sujith, Vamshi Pramodh, Vennela Kisho

శుక్రవారం మొదటి రోజు అవ్వడం, రెండవ రోజు మూడవ రోజు శని, ఆదివారాలు అవ్వడం, నాల్గవ రోజు అయిన సోమవారం వినాయక చవితి సెలవు దినం అవ్వడంతో సాహో వసూళ్లు నిర్మాతల్లో సంబురం నింపాయి.వచ్చిన టాక్‌కు వస్తున్న కలెక్షన్స్‌కు పొంతన లేకుండా ఉంది.నాలుగు రోజుల్లో దాదాపుగా 312 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా సమాచారం అందుతోంది.200 కోట్ల షేర్‌కు కాస్త దూరంలో ఈ చిత్రం ఉంది.లాంగ్‌ రన్‌ లో 250 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్‌ ఉందనిపిస్తుంది.

Telugu Sahoo, Sahooweekend, Sradha Kapoor, Sujith, Vamshi Pramodh, Vennela Kisho

సాహో చిత్రం 250 కోట్ల వసూళ్లను నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదంటున్నారు.100 కోట్లు కూడా రావడం అనుమానమే అంటూ వచ్చిన టాక్‌కు ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్‌ చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.కాస్త కలిసి వస్తే 300 కోట్ల వరకు కూడా ఈ చిత్రం రాబట్టే ఛాన్స్‌ కూడా ఉందని అంటున్నారు.

సాహో చిత్రంకు ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా కూడా ప్రేక్షులు సినిమాను ఆధరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube