జూన్ 13న సాహో నుంచి అదిరిపోయే సర్ప్రైజ్!  

సాహో మూవీ ట్రైలర్ ని జూన్ 13న రిలీజ్ చేస్తున్న చిత్ర నిర్మాతలు. .

Sahoo Movie Trailer Release Date Declared-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు రెడీ అయ్యారు.దానికి తగ్గట్లుగానే సినిమాని దర్శకుడు సుజిత్ సిద్ధం చేస్తున్న్నాడు.శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ తారాగణం కూడా సందడి చేస్తుంది..

Sahoo Movie Trailer Release Date Declared--Sahoo Movie Trailer Release Date Declared-

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా అప్డేట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

సాహో సినిమా ట్రైలర్ ని ఈ నెల 13 ప్రేక్షకుల ముందుకి తెచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.ఇప్పటికే పోస్టర్స్, మేకింగ్ వీడియో తో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ తో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధం అయ్యిందని తెలుస్తుంది.సినిమా మార్కెట్ కోసం ఈ ట్రైలర్ ని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ట్రైలర్ రిలీజ్ తర్వాత చాలా మంది బయ్యర్లు రైట్స్ కోసం పోటీ పడే అవకాశం ఉందని.ఈ నేపధ్యంలో ఆ పోటీని కాష్ గా మార్చుకోవడానికి ట్రైలర్ ని ఆసక్తికరంగా దర్శకుడు సుజిత్ సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.మరి ఇప్పటికే అంచనాలు పెంచిన సాహో మూవీ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది మరో మూడు రోజులలో తెలిసిపోయే అవకాశం ఉంది అని చెప్పాలి.