సాహోకి శాటిలైట్ నుంచి 20 కోట్లు డీల్... ఇప్పుడు కొత్తగా ఏంటి?

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో వచ్చిన మరో భారీ బడ్జెట్ చిత్రం సాహో.సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.

 Sahoo Movie Satellite Rights Sold Out, Young Rebal Star Prabas, Tollywood, Kolly-TeluguStop.com

ఇక సినిమా డిజాస్టర్ అయిన కూడా నిర్మాతలు మాత్రం భారీ నష్టాల నుంచి బయటపడ్డారు.దీనికి కేవలం బాహుబలితో సాహో సినిమాకి వచ్చిన క్రేజ్, అదే సమయంలో హిందీ ప్రేక్షకులని మెప్పించిన యాక్షన్ సీక్వెన్స్ తో సాహో తెలుగు, హిందీ భాషల వరకు బయ్యర్లని కూడా సేఫ్ జోన్ లోకి తీసుకెళ్ళాయి.

అయితే మిగిలిన భాషలలో మాత్రం సినిమాని కొనుక్కున్న బయ్యర్లకి నష్టాలు మిగిల్చింది.

ఇదిలా ఉంటే ఏడాది తర్వాత ఈ సినిమా శాటిలైట్ విషయంలో నిర్మాతలకి కొంత ఊరట కలిగింది అని చెప్పాలి.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని తెలుగు, తమిళంతో పాటు ఇతర రీజనల్ లాంగ్వేజ్ లలో కలిపి 20 కోట్లకి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది.ఇక డిజాస్టర్ అయిన సినిమాకి ఇంత పెద్ద మొత్తంలో శాటిలైట్ రైట్స్ రూపంలో రావడం అనేది సౌత్ ఇండియాలో మొదటి సారి అని చెప్పాలి.

సినిమాలో ఎమోషన్ మిస్ అయిన యాక్షన్ సీక్వెన్స్, ప్రెజెంటేషన్ విషయంలో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉండటంతో కచ్చితంగా టెలివిజన్ పై ప్రేక్షకులని అలరిస్తుందనే నమ్మకంతో ప్రముఖ సంస్థ ఇంత పెద్ద మొత్తం చెల్లించినట్లు తెలుస్తుంది.మరి టెలివిజన్ పై సాహో హవా ఎలా ఉంటుందో, వారి అంచనాలు ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube