'సాహో' జోరు ఈవారం కూడా కొనసాగేనా?

ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంకు మొదటి రోజే ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా కూడా సినిమాలో ఉన్న హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌ మరియు భారీ బడ్జెట్‌తో పాటు పోటీ లేకపోవడం వల్ల భారీ ఓపెనింగ్స్‌ నమోదు అయ్యాయి.మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 375 కోట్ల వరకు వసూళ్లు సాధ్యం అయినట్లుగా సమాచారం అందుతోంది.

 Sahoo Movie Latestupdate Prabhas-TeluguStop.com

రెండవ వారం నేటి నుండి ప్రారంభం.తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద సినిమాలు ఏమీ కూడా విడుదల కాలేదు.

బాలీవుడ్‌లో కూడా స్టార్స్‌ సినిమాలు రాలేదు.

Telugu Bollywood, Kollywood, Producers, Sahoo, Sahoo Day Flop, Sahoo Latest, Sra

ఇక ఇతర భాషల్లో కూడా సాహోకు పోటీని ఇచ్చే స్థాయిలో పెద్ద సినిమాలు విడుదల కాలేదు.మొత్తం అయిదు భాషల్లో విడుదలైన సాహోకు రెండవ వారంలో కూడా పెద్దగా పోటీ లేదు.పోటీ లేకపోవడం వల్ల రెండవ వారంలో కూడా సినిమా రచ్చ వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

మరో 125 నుండి 150 కోట్ల వరకు రాబడితే సరికొత్త రికార్డులు సృష్టించినట్లే అంటూ ట్రేడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.ఇప్పటికే బాహుబలి రికార్డులను తప్ప అన్ని రికార్డులను బ్రేక్‌ చేసిన సాహో బ్రేక్‌ ఈవెన్‌కు కూడా చేరే అవకాశం ఉంది.

Telugu Bollywood, Kollywood, Producers, Sahoo, Sahoo Day Flop, Sahoo Latest, Sra

భారీ నష్టాలు తప్పవని భావించిన బయ్యర్లకు కాస్త ఊరట అని చెప్పుకోవచ్చు.కొన్ని ఏరియాలో సినిమా బయ్యర్లకు సేఫ్‌ చేసింది.కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా రాబట్టాల్సి ఉంది.కొన్ని ఏరియాలో మాత్రం కష్టంగానే ఉంది.బాలీవుడ్‌లో ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించినట్లే అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.లాభాల మాట పక్కన పెడితే ఈ చిత్రం హిందీ బయ్యర్లు పెట్టిన పెట్టుబడిని తీసుకు వచ్చినట్లే అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది.అయితే తమిళం మరియు కన్నడ పరిశ్రమల్లో బ్రేక్‌ ఈవెన్‌కు చాలా ఎక్కువ కావాల్సి ఉంది.

మరి ఈ రెండవ వారంలో అయినా కాస్త ఆ గ్యాప్‌ తగ్గుతుందేమో చూడాలి.మొత్తానికి సాహో చిత్రంకు సెకండ్‌ వారంలో కూడా కాస్త సందడి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube