‘సాహో’ చిల్లర ఖర్చులు 25 కోట్లు       2018-05-26   06:44:06  IST  Raghu V

‘బాహుబలి’ తర్వాత అదే స్థాయి సినిమాను ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్నాడు. పారితోషికం విషయంలో బాహుబలితో పోటీ పడుతున్న ‘సాహో’ చిత్రంను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని కుర్ర దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈయన దర్శకుడిగా అనుభవం కేవలం ఒకే ఒక్క సినిమా. ఆ సినిమా కూడా జస్ట్‌ యావరేజ్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం జంకు భయం లేకుండా ఏకంగా 250 కోట్ల బడ్జెట్‌తో ‘సాహో’ను నిర్మిస్తున్నారు. దుబాయిలో ఒక భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఏకంగా 90 కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటే ఏ రేంజ్‌లో ఈ చిత్రం బడ్జెట్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

‘సాహో’ చిత్రం కోసం దాదాపు మూడు నెలల దుబాయి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. ఆ షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీకరణ చకచక జరుగుతుంది. ఈ చిత్రం కోసం చిల్లర ఖర్చుగా ఏకంగా 25 కోట్లను కేటాయించినట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమాల చిత్రీకరణ సమయంలో నటీనటుల ట్రాన్స్‌పోర్ట్‌ మరియు హోటల్‌ ఖర్చులను చిల్లర ఖర్చులుగా లెక్కేస్తారు. పెద్ద చిత్రాలకు కోటి వరకు ఈ ఖర్చులు ఉంటాయి. ఇక చిన్న చిత్రాలకు లక్షల్లోనే ఈ ఖర్చులు ఉంటాయి. కాని సాహో చిత్రం కోసం ఏకంగా 25 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

దుబాయిలో ఎక్కువ రోజులు, ఎక్కువ సంఖ్యలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉండాల్సి వస్తుంది. అందుకే అక్కడ హోటల్‌ ఛార్జ్‌లు మరియు ఇతరత్ర ఖర్చులకు గాను ఏకంగా 15 కోట్ల మేరకు ఇప్పటి వరకు ఖర్చు అయ్యింది. ఇక ఇంకా కూడా అక్కడ చిత్రీకరణ చేయాల్సి ఉంది. దాంతో పాటు ఇతర దేశాల్లో కూడా చిత్రీకరణకు ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే మరో 10 కోట్లు చిల్లర ఖర్చు అవ్వనుంది. ఇలా మొత్తంగా 25 కోట్ల చిల్లర ఖర్చు కాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ మరియు తమిళంలో కూడా విడుదల అవుతుంది.

పెట్టిన పెట్టుబడికి ప్రతి పైసా కూడా వసూళ్లు అవుతుందనే నమ్మకం ఉండటం వల్లే నిర్మాతలు ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ భారీగా పెరిగింది. దాంతో ఈ రేంజ్‌లో ఖర్చు పెడుతున్నారు. ఒక వేళ పలితం తారు మారు అయితే మాత్రం నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాని నిర్మాతలు వారి లెక్కలు వారు వేసుకుంటున్నారు. చిత్రాన్ని హోల్‌సేల్‌గా 300 కోట్లకు కొనేందుకు కూడా పలు సంస్థలు సిద్దంగా ఉన్నాయి. అందుకే ఎక్కడ రాజీ పడకుండా ఇంత భారీగా సినిమాను చేస్తున్నారు.

,