నేను చేసుకోబోయేది ఇతనినే... లీక్ చేసిన శ్రద్దా కపూర్

బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ స్థాయిని ఏర్పరుచుకుంది.శ్రద్దాకపూర్ కు కుటుంబ సినిమా నేపథ్యం ఉన్నా నటిగా తనకంటూ అభిమానులను సంపాదించుకుంది.

 Shraddha Kapoor Relationship Rumors With Rohan Shrestha, Rohan Shrestha, Shraddh-TeluguStop.com

తెలుగులో సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన శ్రద్దాకపూర్ సాహో సినిమా అభిమానులను కొంత నిరుత్సాహపరిచినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే శ్రద్దాకపూర్ బాలీవుడ్ స్టిల్ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతుండటంతో వీరిద్దరి జంటపై పుకార్లు మొదలయ్యాయి.

అయితే రోహన్ శ్రేష్ఠ తండ్రి రాకేష్ శ్రేష్ఠ స్పందించాడు.

శ్రద్ధ, రోహన్ చిన్ననాటి స్నేహితుడని, వీరిద్దరు కలిసుండాలనే నిర్ణయం తీసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాకేష్ శ్రేష్ఠ వివరణ ఇచ్చారు.

అయితే ఈ విషయంపై ఇటు శ్రద్దాకపూర్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందోనని శ్రద్దా అభిమానులు వేచి చూస్తున్నారు.అయితే శ్రద్దాకపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో, అదే విధంగా శ్రద్దాకపూర్ రోహన్ తో కలిసి మాల్దీవులకు వెళ్ళినట్లు పుకార్లు రావడంతో, రోహన్ శ్రేష్ట,శ్రద్ద కపూర్ మధ్య పుకార్లకు ఊతమిచ్చినట్టైంది.

అయితే ప్రస్తుతానికి ఇద్దరం స్నేహితులమని చెబుతున్నా, భవిష్యత్తులో శ్రద్ధా అభిమానులకు ఏదైనా శుభవార్త ఉండే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube