ప్రతి రోజు ఉదయం ఈ జావా త్రాగితే పొట్ట తగ్గటమే కాకుండా చలువ చేస్తుంది ఎలాగో తెలుసా?

మన పూర్వీకుల కాలం నుండి సగ్గుబియ్యాన్ని వాడుతూ ఉన్నాం.అయితే సగ్గుబియ్యాన్ని వాడకం ద్వారా బరువు తగ్గవచ్చు.

అది ఎలాగో తెలుసుకుందాం.సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా కొవ్వు తక్కువగా ఉంటుంది.

 Saggubiyyam Java Health Benefits-ప్రతి రోజు ఉదయం ఈ జావా త్రాగితే పొట్ట తగ్గటమే కాకుండా చలువ చేస్తుంది ఎలాగో తెలుసా-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందువల్ల బరువు తగ్గాలని అనుకొనే వారు సగ్గుబియ్యాన్ని తీసుకొంటే కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు.అంతేకాక సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అవుతుంది

సగ్గుబియ్యంతో జావా తయారుచేసినప్పుడు బెల్లం,పాలు కలపటం వలన శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది.సగ్గుబియ్యంలో పీచు అధికముగా ఉండుట వలన మలబద్దకం కూడా తగ్గుతుంది


పాలలో కాల్షియం మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉండుట వలన శక్తిని బలాన్ని ఇస్తుంది.బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తహీనత రాకుండా కాపాడుతుంది.

ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం

ముందుగా సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నీటిలో నానబెట్టాలి.ఆ తర్వాత పావుగంట సేపు ఉడికించి పాలను కలపాలి.చివరగా బెల్లాన్ని కలిపి ఐదు నిముషాలు ఆలా ఉంచాలి.ఇప్పుడు కప్పులో పోసుకొని త్రాగాలి

ఈ జావా త్రాగటానికి ఎటువంటి నియమాలు లేవు.

ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా త్రాగవచ్చు.ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేసి కూడా ఈ జవాను త్రాగవచ్చు.

ఈ జావను త్రాగి సులువుగా బరువును తగ్గించుకోండి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు