ఇంత అల్లకల్లోలానికి కారణం సాగర్ ఎలక్షన్​ ఎఫెక్ట్.. నేతలు ఇకనైన కళ్లు తెరవండి.. !?

కరోనాను తేలికగా తీసుకున్న వారికి దీని విశ్వరూపం తెలియడం లేదు.కానీ ఈ వైరస్ వల్ల ఊపిరి అందక నరకం అనుభవిస్తు ప్రాణాలు కోల్పోతున్న వారిని చూస్తే అర్ధం అవుతుంది.

 Sagar Election Effect 10 Thousand Corona Cases Per Month-TeluguStop.com

ఈ చిన్న వైరస్ ఎన్ని కుటుంబాలను దిక్కులేని వారిగా చేస్తుందో.నరకం ఎక్కడో లేదు మనిషి నిర్లక్షం వల్ల ఈ భూమి మీదే కరోనా రూపంలో నెలకొంది.

మరి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్దితులను సమర్ధవంతగా ఎదుర్కొంటూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పాలకులు మాత్రం తమ స్వార్ధం కోసం ఇంతటి భీభత్సానికి కారణం అయ్యారని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.ముఖ్యంగా ఏప్రిల్​లో జరిగిన ఉప ఎన్నికల పుణ్యమా అని నాగార్జున సాగర్​ నియోజకవర్గంలో కరోనా తీవ్రరూపం దాల్చిందట.

 Sagar Election Effect 10 Thousand Corona Cases Per Month-ఇంత అల్లకల్లోలానికి కారణం సాగర్ ఎలక్షన్​ ఎఫెక్ట్.. నేతలు ఇకనైన కళ్లు తెరవండి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేతలు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఎన్నికలకు నెల రోజుల ముందు నుండి ప్రచారం నిర్వహించారు.ఇక ఈనెల 14న సీఎం కేసీఆర్​ బహిరంగ సభ కారణంగా నెలరోజుల వ్యవధిలో ఏకంగా 10 వేల పాజిటివ్​ కేసులు నమోదయ్యాయంటే వీరి నిర్లక్ష్యం ఏ స్దాయిలో ఉందో అర్ధం అవుతుంది.

ఇకపోతే ఈ నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 100 మంది చనిపోయారు.

ఒక్క హాలియా మండలంలోనే 25 మంది మృతి చెందారంటే ఎలక్షన్​ ఏ స్థాయిలో ప్రాణనష్టం కలిగించిందో అర్థం చేసుకోవచ్చు.

మరి ఇలాంటి దారుణానికి కారణం అయిన వారిపై ఎలాంటి కేసులు వేస్తే బాగుంటుంది.కోవిడ్ నిబంధలను పాటించకుండా కరోనా వ్యాప్తికి కారణం అయిన బాధ్యత లేని నాయకులు రాష్ట్రాన్ని ఏలుతున్నారంటే సిగ్గు సిగ్గు అంటూ తెలంగాణ ప్రజలు వాపోతున్నారట.

నేతలు ఇకనైన కళ్లు తెరవండి.!?

#Per Month #10 Thousand #SagarElection #Telangana #Corona Cases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు