ఆ రీమేక్ కోసం పవన్ పాత్రలో మార్పులు చేయలేదంటున్న దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ నడుస్తుంది.

 Sagar Chandra Gives Clarity On Pawan Kalyan Role In Ayyappan, Tollywood, Telugu-TeluguStop.com

ఈ సినిమా తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలని లైన్ లో పెట్టారు.తాజాగా మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మలయాళీ హిట్ మూవీ అయ్యప్పన్ కోశియమ్ రీమేక్ లో నటించడానికి ఒకే చెప్పాడు.ఈ సినిమా మల్టీ స్టారర్ చిత్రంగా ఉండబోతుంది.

సితార ఎంటర్టైన్మెంట్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం పవన్ పాత్రలో మార్పులు చేసి క్యారెక్టర్ ప్రాధాన్యత పెంచారని, ఆపోజిట్ హీరో ప్రాధాన్యతని తగ్గించినట్లు ప్రచారం జరిగింది.

అయితే ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.

అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో రెండు బలమైన పాత్రలుంటాయి.

రెండూ మంచి పాత్రలే.వాటిలో ఉన్న ఫీల్, సోల్ చెడిపోకుండా మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశామని సాగర్ చంద్ర తెలిపాడు.

అంతేతప్ప, ఏ పాత్ర ఔచిత్యాన్ని తగ్గించడం లేదంటుని క్లారిటీ ఇచ్చాడు.మరోవైపు రీమేక్ లో పవన్ పాత్రపై కూడా చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు.

పవన్ ను ఓ అభిమానిగా తను ఎలా చూడాలనుకుంటున్నానో ఓ ఐడియా ఉందని, ఆ ఐడియాస్ ను ఈ రీమేక్ లో చొప్పిస్తానని చెప్పుకొచ్చాడు.తను చేసిన మార్పులు పవన్ కల్యాణ్ కు నచ్చాయని, ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతాయని నమ్మకంగా చెబుతున్నాడు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని మూడో సినిమాతోనే డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్న సాగర్ చంద్ర అతన్ని తెరపై ఎలా ఆవిష్కరిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube