సాగ‌ర్ ఉప ఎన్నిక‌... టీఆర్ఎస్‌లో మూడు ముక్క‌లాట‌...!

తెలంగాణ‌లో దుబ్బాక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఉప ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్పుడు అంద‌రి చూపు నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక మీదే ఉంది.ఇక్క‌డ నుంచి 2018 ఎన్నిక‌ల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మ‌ర‌ణంతో ఇక్క‌డ మ‌రో మూడు, నాలుగు నెల‌ల్లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

 Sagar By-election ... Three Pieces In Trs ...!,telangana,political News,trs,kcr,-TeluguStop.com

దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం, ఇటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ అధికారానికి దూరం కావ‌డంతో ఇప్పుడు నాగార్జునా సాగ‌ర్ ఓట‌ర్ ఎలాంటి తీర్పు ఇస్తారు ? అన్న‌ది పెద్ద ఆస‌క్తిగా మారింది.

అయితే దుబ్బాక‌, గ్రేట‌ర్‌తో పోలిస్తే సాగ‌ర్లో రాజ‌కీయ ప‌రిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి.

ఇది ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి నియోజ‌క‌వ‌ర్గం.అలాంటిది గ‌త ఎన్నిక‌ల్లో నోముల జానారెడ్డిపై 7 వేల ఓట్ల స్వ‌ల్ప మెజార్టీతో విజ‌యం సాధించారు.

ఇక ఇప్పుడు ఉప ఎన్నిక‌ల్లోనూ జానారెడ్డి బ‌రిలో ఉంటే టీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్యే గ‌ట్టి పోటీ ఉండే అవ‌కాశం ఉంది.ఇక ఇక్క‌డ టీఆర్ఎస్ నుంచి ముగ్గురు ప్ర‌ముఖుల పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

వీరిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.వీరితోపాటు కోటిరెడ్డి ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇక మ‌ర‌ణించిన నోముల కుటుంబానికి కూడా సీటు ఇవ్వాల‌న్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.అయితే నోముల కుమారుడిపై స్థానికంగా పార్టీ కేడ‌ర్‌లో వ్య‌తిరేక‌త ఉన్న మాట వాస్త‌వం.

దుబ్బాక‌లో కూడా సానుభూతి కోసం టీఆర్ఎస్ రామ‌లింగారెడ్డి భార్య‌కు సీటు ఇచ్చి చేతులు కాల్చుకుంది.

Telugu Nagarjuna Sagar, Cadre, Telangana, Trs Candi-Telugu Political News

దీంతో కేసీఆర్ మ‌ళ్లీ ఇక్క‌డ నోముల త‌న‌యుడికి సీటు ఇచ్చేందుకు ఒప్పుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.సో ఈ లెక్క‌న గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి లేదా తేరా చిన్న‌ప‌రెడ్డిలో ఎవ‌రో ఒక‌రికి సీటు ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారు.ఇక ఎలాగైనా ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవ్వాల‌ని క‌ల‌లుకంటోన్న గుత్తాకు ఇదే చివ‌రి కోరిక‌.

అయితే ఆయ‌న పోటీ చేస్తారా ?  లేదా ? అన్న సందేహం కూడా ఉంది.మ‌రి ఫైన‌ల్‌గా సాగ‌ర్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రు ? అవుతారో ?  చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube