సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో.. వార్నింగ్ ఇస్తున్న కాంగ్రెస్ ఎంపీ.. ?

సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో వాడిగా వేడిగా మాటల తూటాలు పేలుతున్నాయి.ఇదివరకే టీయార్ఎస్ నేతలు ఇతర పార్టీ నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే బాటలో గులాభి దళాన్ని దడదడలాడిస్తు వున్నాడు.
కాగా సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగుల పల్లి మండల పరిధిలోని ఆబంగాపురం, గజలా పురం, పూసలపాడు, నారాయణపురం గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్, పక్క జిల్లాల నుంచి వ‌చ్చిన నాయకులు బెదిరింపుల‌కు పాల్పడితే దెబ్బకు దెబ్బ తీస్తామని వ్యాఖ్యానించారు.

 Sagar By Election Campaign Congress Mp Giving-TeluguStop.com

అంతే కాకుండా తెలంగాణ పోరాటంలో తొలి అమ‌రుడుగా మిగిలిపోయిన శ్రీకాంతా చారి త‌ల్లి శంక‌ర‌మ్మను ఎమ్మెల్సీగా చేయని కేసీయార్ 200 కోట్లు ఉన్న వాణి దేవిని ఎమ్మెల్సీగా చేసిన అస‌మ‌ర్ధుడు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 Sagar By Election Campaign Congress Mp Giving-సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో.. వార్నింగ్ ఇస్తున్న కాంగ్రెస్ ఎంపీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఈ ఉప ఎన్నికల్లో జానారెడ్డికి ఉన్న ప్రజల మ‌ద్దతు చూడ‌లేక‌నే టీఆర్ఎస్ పార్టీ బెదిరింపు రాజ‌కీయాలు పాల్పడుతోందని, అదీగాక కారు గుర్తు ఎమ్మెల్యేలు వారి నియోజ‌కవర్గ స‌మ‌స్యలు గాలికి వ‌దిలేసి నాగార్జున ‌సాగ‌ర్‌లో డ‌బ్బు మూట‌ల‌తో తిరుగుతు ఓటర్లను మభ్యపెడుతున్నారంటూ ఆరోపించారు.

#Congress MP #SagarBy #Trs Party #CongressMP #Sagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు