విడాకులు ఇవ్వాలని భార్యను ఆ శాడిస్ట్ భర్త ఏం చేశాడంటే?  

sadist husband, demands, divorce, wife, nagpur - Telugu Demands, Divorce, Nagpur, Sadist Husband, Wife

అమ్మాయి ఎంత అనుకువుగా ఉన్న సరే కొందరు భర్తలు దారుణంగా వ్యవహరిస్తారు.ఇక అలానే విడాకుల పత్రంపై సంతకం పెట్టే వరకూ పుట్టింటికి పంపించేది లేదని ఓ గదిలో బంధించాడు శాడిస్ట్ భర్త.

TeluguStop.com - Sadist Husband Demands Divorce For No Reason

ఇంతటి దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.

నాగపూర్ కు చెందిన సోనియా దత్త అనే మహిళ బెంగళూరులో ఫార్మకో గోస్ట్ గా పని చేసేది.అదే నగరంలో పని చేస్తున్నా వినాయక్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్తా పెళ్లి దాకా వెళ్ళింది.

TeluguStop.com - విడాకులు ఇవ్వాలని భార్యను ఆ శాడిస్ట్ భర్త ఏం చేశాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

గత ఏడాది ఆగస్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.అయితే ఈ సంవత్సరం ఆగస్టు 20న సోనియా దత్త ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో మనస్పర్థలు తలెత్తాయ్.ప్రతి రోజు గొడవలు జరిగేవి.

అయితే ఆ మనస్పర్ధలు కాస్త బంధం తెంచే వరకు వెళ్లాయి.వీరిరువురూ గొడవపడే సమయంలో ఎన్నోసార్లు వినాయక్ విడాకులు కావాలని ప్రస్తావించడం జరిగింది.

లాక్ డౌన్ విధించడానికి ముందు వినాయక్ సోనియాని అతని తల్లి దగ్గరకు వెళ్లవలసిందిగా చెప్పాడు.అయితే సోనియా నేను నా పుట్టింటికి వెళ్లాలని అనుకున్నానని అతని తో చెప్పింది.

అయితే వారి మధ్య ఉన్న గొడవల కారణంగా విడాకులు కావాలని కోరాడు.తనను పుట్టింటికి పంపించవలసిందిగా కోరిన సోనియాకు, విడాకుల పత్రంపై సంతకం పెడితే గాని పుట్టింటికి పంపించనని ఓ గదిలో నిర్బంధించాడు ఆ శాడిస్టు భర్త.

అయితే గురువారం తనని ఇంటికి తీసుకెళ్లడానికి సోనియా సోదరి, ఆమె భర్త అక్కడికి వచ్చారు.అయితే సోనియా ఒక గదిలో నిర్బంధించడం చూసి వారు నిర్ఘాంత పోయారు.

విడాకుల పత్రాలపై సంతకం పెట్టిన తర్వాత సోనియానీ ఇంటికి పంపించారు.అయితే ఈ ఘటనపై స్పందించిన వినాయక్ ఏదో ఊహించుకుంటూ తన లోకంలో తను బ్రతుకుతూ నన్ను బాబును పట్టించుకోవడంలేదని, తన కొడుకు గురించి ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించారు.

అయితే తనను చూడటానికి వచ్చిన తన అక్క బావను కూడా కొన్ని గంటల పాటు నిర్బంధించారని సోనియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పాట్నా పోలీసులు మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు ఉన్నాయని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని మీడియాకు తెలిపారు.

#Demands #Sadist Husband #Nagpur #Wife #Divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sadist Husband Demands Divorce For No Reason Related Telugu News,Photos/Pics,Images..