ఎన్నికల కమీషన్‌ కాదు అది వైకాపా కమీషన్‌

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పూర్తిగా ఈసీ తన అధికారంను దుర్వినియోగం చేసిందని, అందరికి సమ న్యాయం చేయాల్సిన ఈసీ పూర్తిగా వైకాపా వైపుకు వ్యవహరించిందని, ఎన్నికల్లో వైకాపాకు పూర్తి మద్దతుగా నిలిచి ఏక పక్షంగా వ్యవహరించిందని తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు.

 Sadineni Yamini Comments On Ec-TeluguStop.com

తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ 150 ఫిర్యాదులు ఇచ్చినా కూడా స్పందించని ఎన్నికల కమీషన్‌ వైకాపా వారు చిన్న ఫిర్యాదు ఇచ్చినా కూడా ఆగమేఘాల మీద స్పందించడం చూస్తేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంది.

తెలుగు దేశం పార్టీని పూర్తిగా ఇరుకున పెట్టేల ఈసీ వ్యవహరించిందని ఆరోపించింది.అందుకే ఎన్నికల కమీషన్‌ను వైకాపా కమీషన్‌ లేదంటే, బీజేపీ కమీషన్‌ అంటూ పేరు మార్చాలని ఈ సందర్బంగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

అసలు ఎన్నికల కమీషన్‌ ప్రతి విషయంలో కూడా వైకాపాకు ఎందుకు మద్దతు పలుకుతుందని ఆమె ప్రశ్నించారు.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఎన్ని విధాలుగా ఓడించే ప్రయత్నం చేసినా కూడా చివరకు గెలిచేది మాత్రం న్యాయం అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.

ప్రతి ఒక్క అవినీతి పరుడు కూడా చివరకు ఓటమి పాలయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయంటూ యామిని అన్నారు.వైకాపా తీరుపై, జగన్‌ అవినీతిపై యామిని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube