ఎన్నికల కమీషన్‌ కాదు అది వైకాపా కమీషన్‌  

Sadineni Yamini Comments On Ec వైకాపా-

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పూర్తిగా ఈసీ తన అధికారంను దుర్వినియోగం చేసిందని, అందరికి సమ న్యాయం చేయాల్సిన ఈసీ పూర్తిగా వైకాపా వైపుకు వ్యవహరించిందని, ఎన్నికల్లో వైకాపాకు పూర్తి మద్దతుగా నిలిచి ఏక పక్షంగా వ్యవహరించిందని తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు.తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ 150 ఫిర్యాదులు ఇచ్చినా కూడా స్పందించని ఎన్నికల కమీషన్‌ వైకాపా వారు చిన్న ఫిర్యాదు ఇచ్చినా కూడా ఆగమేఘాల మీద స్పందించడం చూస్తేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంది.తెలుగు దేశం పార్టీని పూర్తిగా ఇరుకున పెట్టేల ఈసీ వ్యవహరించిందని ఆరోపించింది. అందుకే ఎన్నికల కమీషన్‌ను వైకాపా కమీషన్‌ లేదంటే, బీజేపీ కమీషన్‌ అంటూ పేరు మార్చాలని ఈ సందర్బంగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది..

ఎన్నికల కమీషన్‌ కాదు అది వైకాపా కమీషన్‌-Sadineni Yamini Comments On Ec వైకాపా

అసలు ఎన్నికల కమీషన్‌ ప్రతి విషయంలో కూడా వైకాపాకు ఎందుకు మద్దతు పలుకుతుందని ఆమె ప్రశ్నించారు.తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఎన్ని విధాలుగా ఓడించే ప్రయత్నం చేసినా కూడా చివరకు గెలిచేది మాత్రం న్యాయం అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క అవినీతి పరుడు కూడా చివరకు ఓటమి పాలయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయంటూ యామిని అన్నారు.

వైకాపా తీరుపై, జగన్‌ అవినీతిపై యామిని సంచలన వ్యాఖ్యలు చేశారు.