జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సదా అప్పటి నుంచి తెలుగు ఆడియెన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ గా ఉంటూ వస్తుంది.స్టార్ హీరోయిన్ రేంజ్ తెచ్చుకోలేదు కానీ యువ హీరోలతో సదా ఓ మోస్తార్ క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు.
ఇలా వచ్చి అలా వెళ్లిన హీరోయిన్స్ కన్నా సదా చాలా బెటర్ అనిపించినా కెరియర్ లో మాత్రం అమ్మడు అనుకున్న రేంజ్ వెళ్లలేకపోయింది.యమలీల 2 తర్వాత దాదాపు 7 ఏళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది సదా.ఆమధ్య తెలుగు సూపర్ హిట్ డ్యాన్స్ షో ఢీ కి జడ్జ్ గా కొన్నాళ్లు అలరించింది.ఆ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో మళ్లీ కెరియర్ సెట్ రైట్ చేసుకుంటుందని అనుకున్నారు.
కానీ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.
ఇక ఈమధ్య హీరోయిన్స్ అంతా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
ఈ క్రమంలో సదా కూడా సోషల్ మీడియాలో టాలెంట్ చూపిస్తుంది.రీసెంట్ గా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఓపెన్ చేసి తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది అమ్మడు.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తను మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అంటుంది.ప్రస్తుతం డీజే టిల్లు 2 సినిమాలో సదాకి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
కేవలం హీరోయిన్ గానే కాదు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అంటే అక్క, వదిన పాత్రలకు కూడా తాను రెడీ అంటుంది సదా.సదా చేసిన సినిమాల్లో సూపర్ హిట్ ప్రాజెక్ట్ లు ఉన్నా సరే ఆమెకు ఎందుకో లక్ కలిసి రాలేదు.తెలుగు, తమిళ భాషల్లో సదాకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు.అయితే ఆమె సినిమాలు చేయడం ఆపేసరికి వారు కూడా సైలెంట్ అయ్యారు.సదా మళ్లీ వరుసగా సినిమాలు చేయాలని చూస్తుంది.మరి ఈ ముదురు భామకి అవకాశాలు ఎవరు ఇస్తారో చూడాలి.
సరైన ఛాన్స్ వస్తే మాత్రం తన టాలెంట్ చూపించాలని చూస్తుంది సదా.