డిస్‌లైక్స్‌తో ప్ర‌పంచ‌రికార్డు క్రియేట్ చేసిన `స‌డ‌క్ 2`!!

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ప్ర‌ధానపాత్ర‌లో.ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘సడక్ 2’ ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

 Sadak 2 Movie Trailer Second Most Disliked Video In World! Sadak 2 Movie Trailer-TeluguStop.com

తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేసింది.అయితే డిస్‌లైక్స్‌తో ఈ రికార్డు క్రియేట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `స‌డ‌క్ 2` సినిమా ట్రైల‌ర్‌ ప్ర‌పంచంలోనే రెండో మోస్ట్ డిస్‌లైక్‌డ్ వీడియోగా రికార్డు సృష్టించింది.ఆగ‌స్టు 12న విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు ఇప్ప‌టివ‌ర‌కు 61 మిలియన్ల వ్యూస్ రాగా.డిస్‌లైక్స్ 11.65 మిలియ‌న్లు వ‌చ్చాయి.స‌డ‌క్ 2 దెబ్బ‌కు అప్ప‌టివ‌ర‌కు రెండో స్థానంలో ఉన్న `జ‌స్టిన్ బీబ‌ర్ బేబీ` సంగ్‌ మూడో స్థానానికి వెళ్లింది

ఇక `యూట్యూబ్ రివైండ్ 2018: ఎవ్రీ వ‌న్ కంట్రోల్స్ రివైండ్` వీడియో 18 మిలియ‌న్ల డిస్‌లైక్స్‌తో మొద‌టి స్థానంలో ఉంది.అయితే స‌డ‌క్ 2కు ఇన్ని డిస్‌లైక్స్ రావ‌డానికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం వల్లే సుశాంత్‌ చనిపోయాడని అభిమానులు బ‌లంగా న‌మ్ముతున్నారు.

అందులోనూ ముఖ్యంగా క‌ర‌ణ్ జోహార్‌, ఆలియా భట్, మ‌హేశ్ భ‌ట్‌, రియా చ‌క్ర‌వ‌ర్తి లాంటి వాళ్ల‌పై సుశాంత్ అభిమానులు మ‌రింత ఆగ్రహంతో ఉన్నారు.

ఇక ఆ ఆగ్ర‌హం మొత్తం సడక్ 2 ట్రైల‌ర్‌పై గ‌ట్టిగా చూపించారు.అంతేకాదు, ట్రైల‌ర్ కింద ఈ సినిమాను విమ‌ర్శిస్తూ `జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్` అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube