ఇది ఓ భారత యువతి దీనగాధ...!!!  

Sad Story Of Indian Girl-doctor,student,telugu Nri Updates,unhealthy,visa,దీనగాధ

ఉన్నత విద్యకోసం ఇండియా నుంచీ బ్రిటన్ వెళ్ళిన ఓ యువతికి అక్కడికి వెళ్ళిన తరువాత ఓ అరుదైన జబ్బు సోకింది. ఆ వ్యాధికి భారత్ లో సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో బ్రిటన్ లోనే ఉంటూ చికిత్స చేయించుకుంటోంది..

ఇది ఓ భారత యువతి దీనగాధ...!!!-Sad Story Of Indian Girl

తానూ బ్రతకాలంటే బ్రిటన్ లోనే ఉండాలని వేరే మార్గం లేదని తెలుసుకున్న ఆమె అక్కడే ఉంటోంది.

అయితే తాజాగా అక్కడి అధికారులు ఆమెని తమ దేశం నుంచే వెళ్ళిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు.

స్టూడెంట్ వీసాతో తమ దేశంలో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు తన వీసా గడువు పూర్తవ్వడంతో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తన అనారోగ్య రీత్యా ఇక్కడే ఉండే అవకాసం ఇవ్వాలని కోరుకుంటోంది. ఆమె తనకి కాబోయే భర్త మార్టిన్ మాంగ్లెర్‌ తో కలిసి గత సంవత్సరం డిసెంబర్‌లో అక్కడి అధికారులకు ఆన్‌లైన్‌లో ఆప్లికేషన్ పెట్టుకుంది.

ఈ క్రమంలోనే ఆమెకి వచ్చిన వ్యాధి చికిత్స చేసే క్రమంలో ఓ ఆపరేషన్ చేయగా భవాని కొమాలోకి వెళ్లిపోయింది..

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, ప్రయాణం చేస్తే ఆమె ప్రాణాలకే ముప్పని స్థానిక వైద్యులు కూడా తెలిపారు. అంతేకాదు భావానికి మరో ఆపరేషన్ చేయాల్సి ఉందని గత నెలలో ఒక పారేషణ్ అయ్యిందని మరొకటి చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

ఈ విషయంలో ప్రవాస కౌన్సిల్ సంక్షేమ సంఘం లీగల్ డైరెక్టర్ చాయ్ పటేల్ ఆమె ఆరోగ్యం కుదుట పడేంత వరకూ ఇక్కడే ఉంచాల్సిందిగా కోరుతున్నారు.