'యాత్ర' సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూసే వారికి తీవ్ర నిరాశ కలిగించే విషయం..

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మహానటి’ చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొన్న సంక్రాంతికి వచ్చి పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది.

 Sad News About Yatra Movie-TeluguStop.com

బయోపిక్‌లకు ప్రస్తుతం టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో మోజు ఉంది.అందుకే వరుసగా బయోపిక్‌లు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే వస్తున్న మరో బయోపిక్‌ ‘యాత్ర’.భారీ అంచనాల నడుమ రూపొందిన ‘యాత్ర’ సినిమాను వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన విషయం తెల్సిందే.

ఇటీవలే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

మామూలుగా బయోపిక్‌లు అంటే డాక్యుమెంటరీ టైప్‌ కాకుండా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తేనే ప్రేక్షకులు ఆధరిస్తారు.ఆ విషయం మహానటి చిత్రంతో నిరూపితం అయ్యింది.రియల్‌ ఫుటేజ్‌తో సినిమాను చూపిస్తే అది ఖచ్చితంగా డాక్యుమెంటరీ టైప్‌లోనే ఉంటుంది.

అయితే యాత్ర సినిమాలో చివరి 20 నిమిషాల పాటు రియల్‌ ఫుటేజ్‌ ఉంటుందని చిత్ర యూనిట్‌ వర్గాల నుండి సమాచారం అందుతోంది.సినిమా వైఎస్‌ రాజకీయ ఎంట్రీ నుండి ప్రారంభం అవుతుందట.

రాజకీయాల్లో ఎలా కొనసాగాడు, రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ, పాదయాత్రకు సంబంధించిన విషయాలను చూపించబోతున్నారు.

సినిమా రెండు గంటలకు కాస్త అటు ఇటుగానే ఉంటుందని తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో వైఎస్‌ జగన్‌ పాత్రను ఎవరు పోషిస్తారని అంతా ఎదురు చూశారు.అయితే ఆయన పాత్రలో ఆయనే కనిపిస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు తేల్చి పారేశారు.

సినిమా ఆరంభం నుండి జగన్‌ కనిపించడు.రాజశేఖర్‌ రెడ్డి చనిపోయిన సమయంలో వైఎస్‌ జగన్‌ కనిపిస్తాడు.

అది కూడా స్వయంగా జగన్‌ కనిపిస్తాడు.అయితే అప్పటి వీడియోలను చూపిస్తారట.

వార్తల్లో చూసిన ఆ వీడియోలను ఇప్పుడు చూపిస్తే ఎలా ఉంటుందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.వాటిని కూడా షూట్‌ చేస్తే బాగుండేది అంటున్నారు.

సినిమాలో ఎక్కువ శాతం రొటీన్‌గా ఉంటుంది కనుక ఇదో డాక్యుమెంటరీ తరహా మూవీగా ఉంటుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది కాస్త చేదు వార్తే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube