ఎన్ఆర్ఐ స్థలం ఆక్రమణ.. పంజాబ్‌లో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం

ప్రవాస భారతీయుడికి చెందిన స్థలం కబ్జా కావడంతో పంజాబ్‌లో అధికార , విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.శిరోమణి అకాలీదళ్( Shiromani Akali Dal ) (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్( Sukhbir Singh Badal ) మీడియాతో మాట్లాడుతూ.

 Sad Chief Sukhbir Badal Accuses Aap Jagraon Mla Of Occupying Nri’s House , Suk-TeluguStop.com

ఆప్‌ మహిళా నేత, జాగ్రవ్ ఎమ్మెల్యే సర్వజిత్ కౌర్ మనుకేపై సంచలన ఆరోపణలు చేశారు.సర్వజిత్ కౌర్ అనుచరులు.

కెనడాలో స్థిరపడిన ఎన్ఆర్ఐకి చెందిన భూమిని ఆక్రమించారని ఆరోపించారు.ఈ విషయంపై ఫిర్యాదు అందినప్పటికీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయలేదని బాదల్ ఆరోపించారు.

దీని వల్ల పంజాబ్‌లో తమ భూములు, ఆస్తులు సురక్షితంగా లేవని ఎన్ఆర్ఐలు భావించే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కేసులో చర్యలు తీసుకోవడంలో జరిగిన విపరీతమైన జాప్యంపై సీఎం భగవంత్ మాన్( CM Bhagwant Mann ), డీజీపీలు వివరణ ఇవ్వాలని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు.

ఎన్ఆర్ఐల సంక్షేమం పట్ల ఆప్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆయన మండిపడ్డారు.అయితే దీనిపై ఆప్ నేతలు సైతం ఘాటుగానే కౌంటరిస్తున్నారు.

Telugu Jaswant Singh, Nris, Punjab, Shiromaniakali, Sukhbirsingh-Telugu NRI

కాగా.ప్రధానంగా వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు( NRIs ) పంజాబ్‌లో ఉన్న తమ ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ప్రవాసుల ఆస్తులను కొందరు అక్రమించుకోవడం, నకిలీ పత్రాలను సృష్టించి తమ సొంతం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.న్యాయ వ్యవస్థలోని లోసుగులను అడ్డుపెట్టుకుని వీరు విచారణ ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నారని పలువురు ఎన్ఆర్ఐలు వాపోతున్నారు.

Telugu Jaswant Singh, Nris, Punjab, Shiromaniakali, Sukhbirsingh-Telugu NRI

గతేడాది జస్వంత్ సింగ్( Jaswant Singh ) అనే పంజాబ్‌కు చెందిన ప్రవాస భారతీయుడు తన భూమి కబ్జా కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యవహారం కలకలం రేపింది.తన జీవితకాలంలో ఎక్కువ రోజులు న్యూయార్క్‌లో గడిపిన ఆయనకు పంజాబ్‌లోని స్థానిక పోలీసులు, న్యాయవ్యవస్థ నుంచి సరైన సహకారం అందక ఇబ్బంది పడుతున్నారు.అమృత్‌సర్‌కు సమీపంలోని సంఘ్నా గ్రామంలో వున్న తన వ్యవసాయ భూమిని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించేందుకు జస్వంత్ సింగ్ పడరాని పాట్లు పడుతున్నారు.చిన్న వయసులోనే భారత్‌ను విడిచి వెళ్లిపోయిన తనకు స్థానిక వ్యవస్థను ఎదుర్కోవడం, పనిచేయించుకోవడం తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube