ఆ వికలాంగుడి టార్గెట్ క్రికెట్ దేవుడు సచిన్..! ఎలా అంటే..?!

చాలా మంది ఎన్నో విచిత్రమైన పనులు, ఆశ్చర్యపరిచే పనులు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంటారు.అంతేకాదు అతిసాధారణ పనలు చేస్తూ రికార్డులు నెలకొల్పుతుంటారు.

 Sachin, The Cricket God Of The Disabled's Target How Is That , Delhi , Vinod Kum-TeluguStop.com

తాజాగా అలాంటి వ్యక్తి గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇండియన్ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇప్పటి వరకూ 19 గిన్నిస్‌ రికార్డులను నెలకొల్పాడు.

ఏ రోజుకైనా సచిన్ రికార్డులను బద్దలు కొట్టాలని, ఆయనకంటే ఎక్కువ రికార్డులు నెలకొల్పాలని ఇక్కడో వ్యక్తి అనుకుంటున్నాడు.అందులో భాగంగా ఇప్పటికే అనేక రకాల రికార్డులను బద్దలు కొట్టాడు.

ఇకపై కూడా బద్దలు కొట్టనున్నాడు.ఇలా సచిన్ తో పోటీ పడుతున్న ఆ వ్యక్తే .వినోద్‌.ఆయన ఓ టైపిస్టు.వేగంగా టైప్ చేయడం ఆయనకు అలవాటు.వినోద్‌ కుమార్‌ 46.3 సెకన్లలో నూట మూడు పదాలను అలవోకగా టైప్ చేసేస్తాడు.ఆయన టైపు చేసేది చేతులతో కాదు ముక్కుతో కావడం వల్ల చాలా మంది ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు.

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా వినోద్‌ కుమార్‌ పని చేస్తున్నాడు.

Telugu Delhi, Guinness, Vinod Kumar, Latest-Latest News - Telugu

ఆయన్ని చూడగానే ఓ సాధారణమైన వ్యక్తిలాగానే కనిపిస్తాడు.అయితే ఆయన పేరు మీద ఒకటి కాదు రెండు కాదు, తొమ్మిది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు ఉన్నాయంటే ఎవ్వరూ నమ్మరు.జెఎన్‌యూలోని స్కూల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌లో ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

సంస్థ యొక్క సమాచారాన్ని కంప్యూటర్‌లో భద్రపరచడం వినోద్ చేసే పని.అందువల్లనే ఆయన ఎక్కువ సమయం టైప్ చేయడం మీదనే గడుపుతుంటాడు.నలభై సంవత్సరాలు అయిన వినోద్‌కు మిల్కా సింగ్‌ లాగా అథ్లెట్‌లా అవ్వాలని ఉండేది.అయితే అది నెరవేరలేదు.ఆయన ఇంట్లో ఓ కంప్యూటర్‌ సెంటర్ ను పెట్టి పేదలకు, దివ్యాంగులకు కంప్యూటర్‌లో శిక్షణ ఇస్తూ ఉండేవాడు.2014లో ముక్కుతో కంపోజ్‌ చేస్తున్న వ్యక్తి అనే వార్త విని స్ఫూర్తి పొందాడు.దీంతో తాను కూడా అలా చేసి రికార్డు సాధించాడు.అక్కడితో ఆగకుండా ఒక చేయితో, కళ్లకు గంతలు కట్టుకుని కంపోజ్‌ చేయడం, నోట్లో చెక్క ముక్క పెట్టుకుని కంపోజ్‌ చేయడం ఇలా కొన్ని రకాల విన్యాసాలు చేస్తూ గిన్నిస్ రికార్డును సాధించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube