గత ఆదివారం దక్షిణాఫ్రికాలో తొలి అండర్ 19 మహిళా ప్రపంచ కప్ టోర్నీ ఇండియా గెలవటం తెలిసిందే.ఫైనల్ లో ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
ఐసీసీ ఆధ్వర్యంలో మొదటి అండర్ 19 మహిళా ప్రపంచ కప్ ఇండియా గెలవడం పట్ల ప్రధాని మోడీతో పాటు పలువురు క్రికెటర్లు.సెలబ్రెటీలు సంతోషం వ్యక్తం చేశారు.
అదే సమయంలో బీసీసీఐ కార్యదర్శి జైషా… ఫిబ్రవరి మొదటి తారీకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సత్కరించనునట్లు తెలిపారు.

ఈ క్రమంలో నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టి20 మ్యాచ్ ప్రారంభానికి ముందు అండర్ 19 మహిళా ప్రపంచ కప్ గెలిచిన ఇండియా టీంని సత్కరించారు.ఈ సందర్భంగా ప్లేయర్లకు ఐదు కోట్ల రూపాయల చెక్ అందజేయడం జరిగింది.ప్రపంచ కప్ గెలిచిన ప్లేయర్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపారు.
భవిష్యత్ క్రికెట్ ప్లేయర్లకు మీరు రోల్ మోడల్స్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
