"వెయిటర్" కోసం వెతుకుతున్న సచిన్ ఎందుకో తెలుసా..?

భారత దేశంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు.అయితే తాజాగా సచిన్ టెండూల్కర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్  చేశాడు.

ఇప్పుడు ఆ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఇంతకీ ఆ ట్వీట్ ఏంటీ అసలు దేని కోసం సచిన్ ఆ ట్వీట్ చేసాడనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Telugu Bcci, Chennai, India Cricket, Tendulkar, Tendulkarwaiter, God Cricket, Wa

తాజాగా సచిన్ టెండూల్కర్ ఒక ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో కలిసి పంచుకున్నాడు.అయితే ఈ క్రమంలో గతంలో ఓ సారి తాను టెస్ట్ మ్యాచ్ ఆడడానికి  చెన్నైకి వెళ్ళినప్పుడు ఒక హోటల్ లో బస చేసానని, అప్పుడు ఒక వెయిటర్ తన గదిలోకి కాఫీ తీసుకుని వచ్చి మీతో క్రికెట్ గురించి మాట్లాడాలని అందుకు తన అనుమతి కావాలని అడిగాడు.దాంతో సచిన్ సరే అనగా  అప్పుడు ఆ వెయిటర్ “మీరు క్రికెట్ ఆడే సమయంలో మోచేతికి ఆర్మ్ గార్డ్ కట్టుకున్న ప్రతీసారీ మీరు బాల్ ని బలంగా బడే సమయంలో కొంత మేర స్వల్ప తేడాలు చోటు చేసుకుంటున్నాయి.

అంతేగాక అది మీ బ్యాటింగ్ పై ప్రభావం చూపుతోందని అన్నాడు”.అలాగే తాను మీరు ఆడిన మ్యాచ్ లో ప్రతీ బాల్ ని ఐదు లేదా ఏడూ సార్లు చూస్తానని అందువల్లనే ఈ తేడాని గమనించినట్లు చెప్పాడు. 

దీంతో సచిన్ క్రికెట్ ప్రాక్టీస్ అనంతరం ఒకసారి వెయిటర్ చెప్పిన విషయాల గురించి ఆలోచించానని అన్నాడు.అంతేగాక ఇప్పటి వరకూ ప్రపంచంలో ఈ విషయం గురించి తనతో ఎవరూ చెప్పలేదని అన్నాడు.

 అయితే ఆ వెయిటర్ చెప్పిన విధంగా తన మోచేతి ఆర్మ్ ప్యాడ్ ని రీ డిజైన్ చేసి చూడగా తన బ్యాటింగ్ లో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పాడు.  అలాగే తనకు ఇంత మంచి విషయాన్ని చెప్పిన ఆ వెయిటర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఉందని అందుకుగానూ తనకు సహాయం చేయాల్సిందిగా నెటిజన్లను సచిన్ కోరాడు.  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube