అదిరిపోయే లుక్​లో ప్రత్యక్షమైన సచిన్ టెండూల్కర్.. కామెంట్ చేసిన యువీ!

టీమ్​ ఇండియా క్రికెట్​ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.అంతర్జాతీయ క్రికెట్ నుండి సచిన్ రిటైర్ అయిపోయి 9 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన్ని ఆరాధించేవారు అనేకమంది వున్నారు.

 Sachin Tendulkar Appeared In A Stunning Look Yuvi Commented , Sachin Tendulkar, Viral Latest, News Viral, Social Media, Video Viral ,yuvraj Singh-TeluguStop.com

మనదేశంలోనే కాదు, దేశవిదేశాల్లో కూడా అతన్ని కీర్తిస్తారు.ఇక సచిన్ టెండూల్కర్ సాధించిన ఘనతలు గురించి మాట్లాడుకోవలసిన పనిలేదు.

వాటిగురించి రాయాలంటే ఒక పేజీ సరిపోదు.నేటి క్రికెట్ క్రీడాకారులకు సచిన్ ఓ స్ఫూర్తిదాయకం.

 Sachin Tendulkar Appeared In A Stunning Look Yuvi Commented , Sachin Tendulkar, Viral Latest, News Viral, Social Media, Video Viral ,Yuvraj Singh-అదిరిపోయే లుక్​లో ప్రత్యక్షమైన సచిన్ టెండూల్కర్.. కామెంట్ చేసిన యువీ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టెండూల్కర్ అటనుండి భౌతికంగా దూరమైనా, మానసికంగా చాలా దగ్గరగా ఉంటాడు.ప్రపంచంలో జరుగుతున్న వివిధ క్రికెట్ మ్యాచెస్ తిలకిస్తూ ఉంటాడు.ఇకపోతే సచిన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా వుంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.తాజాగా టెండూల్కర్ తన సోదరుడు నితిన్‌ టెండూల్కర్ కుమార్తె పెళ్లి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యక్షమయ్యాడు.

గోధుమ రంగు షేర్వాణీ ధరించిన సచిన్‌.ఎర్రటి తలపాగాతో రాజవంశీయుడిగా కనిపించాడు.

ఫేటా పెట్టుకుంటున్న వీడియోను సచిన్‌ తన ఇన్​స్టాలో పోస్ట్‌ చేస్తూ.“వెడ్డింగ్‌, షాదీ సెలబ్రేషన్‌” అంటూ హ్యాష్‌ ట్యాగ్స్​ జత చేశాడు.దీంతో ఆ వీడియో కాస్త సోషల్​ మీడియాలో వైరల్ అయిపోయింది.ఇక సచిన్‌ పెట్టిన పోస్ట్‌పై టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఫన్నీగా స్పందించాడు.సచిన్‌ను టీజ్‌ చేస్తూ.‘ఓయ్‌ సచిన్‌ కుమార్‌.హే!’ అంటూ కామెంట్​ చేశాడు.సచిన్‌ అంటే యువీకి ఎంత అభిమానమో చెప్పాల్సిన పనిలేదు.2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌కు టైటిల్‌ అందించిన యువరాజ్‌ తన గెలుపును సచిన్‌కు అంకితమిచ్చి.‘ఇదంతా సచిన్‌ కోసమే’ అంటూ పేర్కొనడం అప్పట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసినదే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube