ఆ సమయంలో కెప్టెన్సీ కోసం ధోని పేరును తానే సూచించా అంటున్న క్రికెట్ దిగ్గజం...!

మూడు రోజుల క్రితం ప్రపంచ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలియజేసిన మహేంద్రసింగ్ ధోని తో తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు భారతదేశ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.తాను 2007 టి20 వరల్డ్ కప్పుకు టీమిండియా కెప్టెన్సీ కోసం బిసిసిఐ ఎవరిని కెప్టెన్సీ గా ఉంచాలన్న నేపథ్యంలో తానే ధోనిని సూచించినట్లు సచిన్ తెలియజేశాడు.

 Suggested To Bcci That Ms Dhoni Should Be Made Captain Says Sachin Tendulkar, Sa-TeluguStop.com

ఇందుకు కారణం తాను ధోనీతో కలిసి మ్యాచులు ఆడుతున్న సమయంలో ఫస్ట్ స్లిప్ లో నిల్చొని, నేను ధోని ఆటను ఏ విధంగా ఆటను ఆస్వాదిస్తాడో, అతని నైపుణ్యాన్ని గమనించానని, అప్పుడే ధోని టీమిండియాకు కాబోయే కెప్టెన్ అని భావించినట్టు సచిన్ టెండూల్కర్ తెలిపాడు.

ఇకపోతే 2007లో సౌత్ ఆఫ్రికా లో జరిగిన మొదటి టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి సమయంలో తాను, సౌరబ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ లు గాయాల కారణంతో తాము టోర్నీకి దూరంగా ఉండాలని భావించినట్లు తెలియజేశారు.

అంతేకాకుండా టీమిండియా జట్టు లోకి కచ్చితంగా యువకులు వస్తే బాగుంటుందని భావించినట్లు సచిన్ తెలిపారు.ఆ సమయంలోనే టీమ్ ఇండియా లో ఉన్న సీనియర్ ఆటగాళ్లు అందరము ధోనీనే ఆ ప్రపంచకప్ కు కెప్టెన్సీ గా వ్యవహరిస్తే బాగుంటుందని సూచించామని తెలియజేశాడు.

Telugu Bcci, Cricketer, Msdhoni, Tendulkar, Bccidhoni, Cup-Sports News క్ర

ఇక ఆ పై ధోనీ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దాదాపు 16 సంవత్సరాల పాటు టీమిండియాకు మహేంద్రసింగ్ ధోని సేవలు అందించాడు.టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా బాధ్యతలు వహించిన ధోని అనేక విజయాలను నమోదు చేశాడు.ఆపై 2007లో టి20 వరల్డ్ కప్, ఆ తర్వాత 2011లో పరిమిత ఓవర్ల ప్రపంచ కప్, ఆపై 2013లో చాంపియన్స్ ట్రోఫీని గెలిచి ఐసిసి నిర్వహించే అన్ని ఫార్మాట్ల ను గెలిచిన ఏకైక కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ చరిత్రలో నిలిచిపోయాడు.

అంతేకాదు మహేంద్రసింగ్ ధోని కేవలం టీమిండియా తరపున కాకుండా బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ టోర్నీలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు సార్లు ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube