కోహ్లీ చేసిన తప్పుకు సచిన్ స్పందన...!

మామూలుగా క్రికెట్ ఆటలో బంతి మెరవాలంటే అందుకు ఉమ్ము రాయడం చాలా కాలం నుండి మనం చూస్తూనే ఉన్నాం.కాకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఐసీసీ విధించిన కఠిన నిర్ణయాలలో మొదటిది బాల్ కు ఉమ్మి రాయడం.

 Rcb, Ipl, Ipl 2020, Sachin, Virat Kohil, Twitter, Netizens-TeluguStop.com

ఇకపోతే తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో మొదటగా రాజస్థాన్ రాయల్స్ చెందిన ఆటగాడు రాబిన్ ఊతప్ప ఈ పొరపాటు చేసి క్రికెట్ పెద్దల విమర్శలను మూటగట్టుకున్నాడు.

అయితే ఇదే తప్పును చేశాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.

ఇలా చేస్తున్న సమయంలో కెమెరా కంటికి చిక్కాడు విరాట్ కోహ్లీ.అయితే ఆ విషయాన్ని వెంటనే గమనించిన విరాట్ తన తప్పు తెలుసుకున్నాడు .తాజాగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మూడో ఓవర్ లో పృద్వి షా షాట్ ను షార్ట్ కవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ అడ్డుకున్నాడు.

అయితే పూర్తిగా అటలో మునిగి పోయిన విరాట్ కోహ్లీ తొందరలో అలవాటులో పొరపాటుగా తన ఉమ్మిని తీసి బంతికి రాసేశాడు.అయితే ఈ విషయాన్ని వెంటనే గమనించిన విరాట్ కోహ్లీ తాను చేసింది తప్పని తెలుసుకొని పొరపాటు అయిపోయింది అన్నట్లుగా సంజ్ఞ చేశాడు.అయితే ఈ విషయంపై నెటిజన్స్ కాస్త సరదాగానే కామెంట్లు కురిపిస్తున్నారు.అయితే ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.“గెలిచే కసిలో అంతే… అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి” అంటూ సచిన్ ట్విట్టర్ పూర్వకంగా తెలిపాడు.ఈ కొత్త నిబంధన ఐసీసీ తాజాగా జూన్ నెలలో విధించింది.ఇలా మొదటిసారి చేస్తుంటే ఆటగాన్ని ఫీల్డ్ అంపైర్ కొత్త రూల్స్ ను ఆటగాడికి వివరించాలి, అలాగే రెండోసారి కూడా అదే ఆటగాడు అలా చేస్తే అంపైర్లు హెచ్చరిస్తారు.

ఆ తర్వాత కూడా మూడో సారి చేసినట్లయితే అవతలి టీం వారికి ఐదు పరుగులను బోనస్ గా ఇస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube