ఐపీఎల్ 2021 లో సచిన్ తనయుడి రంగప్రవేశానికి సర్వం సిద్ధం..!

మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు, కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఐపీఎల్ 2021 వేలంపాటలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు.కానీ బీసీసీఐ బోర్డు ఐపీఎల్ వేలం పాట కోసం ఫైనలైజ్ చేసిన 292 మంది జాబితా లో శ్రీశాంత్ పేరు లేదు.

 Sachin Ready For His Sons Debut In Ipl 2021, Cricker , Sreeshanth, Ipl, Sachin S-TeluguStop.com

దీంతో ఆయన ఈసారి ఐపీఎల్ లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.అప్పట్లో ఐపీఎల్ మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడి 7 ఏళ్ల పాటు నిషేధిత శిక్షను అనుభవించిన తర్వాత శ్రీశాంత్ కి కొన్ని నెలల క్రితమే కాంపిటేటివ్ క్రికెట్ మ్యాచ్ లలో పాల్గొనే అవకాశం వచ్చింది.

దీంతో ఆయన ఈసారి ఐపీఎల్ లో ఆడేందుకు దరఖాస్తు చేసుకున్నారు.కానీ బీసీసీఐ అతన్ని షార్ట్ లిస్ట్ చేయలేదు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో కేరళ తరఫున క్రికెట్ ఆడిన శ్రీశాంత్ ఐదు మ్యాచులలో మొత్తం 44 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు.ఐదు మ్యాచ్లలో కేరళ జట్టు మూడు మ్యాచ్లు గెలిచింది కానీ ఫైనల్ స్టేజ్ కి చేరుకోలేకపోయింది.

ఇదిలా ఉండగా టెస్ట్ స్పెషలిస్టు చటేశ్వర్ పుజారా, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఫైనల్ లిస్టులో స్థానాన్ని సంపాదించుకున్నారు.అర్జున్ టెండూల్కర్ ని ఎవరు దక్కించుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.

శ్రీశాంత్ స్థానం దక్కించుకోలేదు కానీ 40 ఏళ్ల లెఫ్ట్ అర్మ్ బౌలర్ నయన్ దోషి కూడా ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో పాల్గొనేందుకు అర్హత దక్కించుకున్నారు.ఈయన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ తరపున 2011, 2012 సంవత్సరాల్లో ఆడారు.

ఇకపోతే ఈసారి తమకు అవసరం లేని ఆటగాళ్లను 8 ఫ్రాంచైజీలు జనవరి నెలలోనే వెల్లడించాయి.వారిలో టాలెంటెడ్ క్రికెటర్లు ఎవరెవరు ఉన్నారో కింద వివరంగా తెలుసుకుందాం.

Telugu Arjun Tendulkar, Cricker, Ipl, Maxwell, Son, Teams, Srikanth, Steve Smith

ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ని రాజస్థాన్ రాయల్స్ వదులుకుంది.కింగ్స్ లెవెన్ పంజాబ్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మాక్స్ వెల్ ని వదులుకుంది.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్లు అయిన ఉమేష్ యాదవ్, డేల్ స్టేయిన్ లను వదులుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube