పతనం అంచున రాజస్థాన్ సర్కార్, సంక్షోభం తప్పేలా లేదు!  

Sachin pilot is not ready to compromise , Rajasthan, Sachin Pilot, Ashok Gehlot, Priyanka Gandhi, Rahul Gandhi, Jyotiraditya Scindia , Rajasthan Governament - Telugu Ashok Gehlot, Jyotiraditya Scindia, Priyanka Gandhi, Rahul Gandhi, Rajasthan, Rajasthan Governament, Sachin Pilot

గత కొద్దీ రోజులుగా రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఆ రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం ల మధ్య ఏర్పడిన విభేదాలు తారా స్తాయికి చేరుకోవడం తో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితి ఏర్పడింది.

 Sachin Pilot Ashok Gehlot Rajasthan Governament

సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ల మధ్య విభేదాలు ముదరడం తో పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.తనకు 30 మంది ఎమ్మెల్యేల తో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా ఉందంటూ పైలట్ తిరుగుబాటు పట్టారు.

తాజా గా జరిగిన సీ ఎల్ఫీ సమావేశానికి సైతం డుమ్మా కొట్టడం తో అధిష్టానం కూడా పైలట్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఇప్పటికే ఈ అంశం పై ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ కూడా మధ్యవర్తిత్వానికి దిగినప్పటికీ సచిన్ పైలట్ మాత్రం మెత్తబడడం లేదు అన్నట్లు తెలుస్తుంది.

పతనం అంచున రాజస్థాన్ సర్కార్, సంక్షోభం తప్పేలా లేదు-Political-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పటికే పైలట్ పై గుర్రుగా ఉన్న అధిష్టానం మరో అవకాశం ఇచ్చి చూడాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.మరోపక్క అశోక్ గెహ్లాట్ కు 104 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని భావిస్తున్నప్పటికీ సమావేశానికి మాత్రం 97 మందే హాజరు కావడం తో మరోసారి అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.

దీనితో రాజస్థాన్ లో కూడా ఆపరేషన్ కమలం విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పైలట్ ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా తో భేటీ అయినట్లు తెలుస్తుంది.

ఈ సందర్భంగా సింధియా కూడా పార్టీ లో పైలట్ కు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదంటూ ఆయన అభిప్రాయపడడం గమనార్హం.మొత్తానికి రాజస్థాన్ లో కూడా రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.

#Rahul Gandhi #Ashok Gehlot #Priyanka Gandhi #Rajasthan #Sachin Pilot

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sachin Pilot Ashok Gehlot Rajasthan Governament Related Telugu News,Photos/Pics,Images..