పూరన్ ఆటకు సచిన్ ఫిదా.. అసలు విషయమేమిటంటే...?!

అసలు జరుగుతుందో జరగదో అన్న ఐపీఎల్ 13 సీజన్ ఎట్టకేలకు యూఏఈ దేశంలో మొదలైంది.సిరీస్ మొదట్లో మ్యాచులు అభిమానులకు ఆనందాన్ని పంచలేకపోయినా ఇప్పుడిప్పుడే కొన్ని మ్యాచులు చూస్తుంటే అభిమానులకు కిక్ వస్తుంది.

 Sachin, Puran, Rajesthan Royals, Sixes, Foures, Twitter, Photo,cricket-TeluguStop.com

ఇక తాజాగా జరిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారీ ఛేదనలో దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సిక్సర్ల వర్షం కురిపించి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో క్రికెట్ చరిత్రలోనే ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన ఫీలింగ్ సన్నివేశం అభిమానులకి ఇట్టే కట్టి పడేస్తుంది.

దీనికి భారత దేశ క్రికెట్ దేవుడిగా పిలిచే సచిన్ టెండూల్కర్ సైతం షాక్ అయ్యాడు.కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ బౌండరీ లైన్ వద్ద గాల్లో వెళ్తున్న బంతిని ఆపిన తీరు నిజంగా అందరిని ఒకింత ఆశ్చర్యపరిచింది.

సిక్స్ ఖాయం అని అనుకున్నా ఆ సమయంలో నికోలస్ పూరన్ ఆ బంతిని గాలిలో పట్టుకొని అమాంతం గ్రౌండ్లోకి విసిరేశాడు.ఇది చూసిన క్రికెట్ అభిమానులు నిజంగా ఆశ్చర్యపోయారు.

క్రికెట్ దిగ్గజాలు కూడా ఈ ఫీల్డింగ్ చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎనిమిదోవ ఓవర్ వేస్తున్న మురుగన్ అశ్విన్ బౌలింగ్ లో సంజు శాంసన్ భారీ షాట్లతో బౌండరీ వైపు బాలుని బాదేశాడు.

ఆ దెబ్బకి అది కచ్చితంగా అందరు సిక్స్ అని భావించారు.అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఫీల్డర్ పూనమ్ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని పట్టేసుకొని తిరిగి మళ్ళీ మైదానంలోకి విసిరేశాడు.

దీంతో 6 పరుగులు రావాల్సిన చోట కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫీల్డర్ జాంటీ రోడ్స్.

ప్రస్తుతం పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ గా పనిచేస్తున్నారు.ఆయన కూడా సమయంలో లేచి మరీ పురాన్ కు చప్పట్లతో తన అభిమానాన్ని తెలిపాడు.

ఈ సన్నివేశాన్ని భారతదేశ క్రికెట్ దేవుడు సచిన్ కూడా స్పందించాడు.తన లైఫ్ లో చూసిన అద్భుతమైన సేవ్ అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫోటోను షేర్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube