చేవెళ్ళ టీఆర్ఎస్ అభ్యర్ధిగా సబిత తనయుడు?  

టీఆర్ఎస్ నుంచి చేవెళ్ళ ఎంపీ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్న సబిత తనయుడు కార్తీక్ రెడ్డి. .

  • మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరడం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఆమెని బుజ్జగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన కూడా పార్టీలో తన మాటకి విలువ లేకపోవడం, అలాగే తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు తన కుమారుడుకి ఎంపీ టికెట్ విషయంలో కూడా అధిష్టానం నుంచి హామీ రాకపోవడంతో సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తిలో వున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఆమె పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

  • ఇదిలా వుంటే సబిత కుమారుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ళ పార్లమెంట్ సీటు ఇస్తామని కేసీఆర్ నుంచి ఇప్పటికే హామీ కూడా రావడంతోనే ఆమె టీఆర్ఎస్ లో వెళ్ళడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ఒకటి రెండు రోజులలో అధికారికంగా నిర్ధారించే అవకాశం వుందని సమాచారం. ఇదిలా వుంటే సబిత తీసుకున్న నిర్ణయం పట్ల అధిష్టానం తీవ్ర అసహనంతో వుందని టాక్ వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఆమె రాజీనామా చేయడానికంటే ముందుగానే ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.