సబిత ఇంద్రా రెడ్డి కారు ఎక్కడానికి ముహూర్తం ఫిక్స్! ఫలించని బుజ్జగింపులు!  

బుధవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సబితా ఇంద్రారెడ్డి..

  • పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య పెరిగిపోతుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ తమకి ప్రతిపక్షం అంటూ లేకుండా చేయాలని పెట్టుకున్న టార్గెట్ ని మెల్లగా అతని కుమారుడు కేటీఆర్ పూర్తి చేసేస్తున్నాడు. ఆపరేషన్ ఆకర్ష్ కి కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్ వైపు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు స్పష్టం చేసేసారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ని మరో గట్టి దెబ్బ తగిలింది.

  • వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో హోం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆమె తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా కెసిఆర్తో భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వాలని అడిగింది. దానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమెని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో బుధవారం ఆమె తన నిర్ణయాన్ని అధికారికంగా చెప్పడంతో పాటు టీఆర్ఎస్ తీర్ధం తీసుకునే అవకాశం వుందని తెలుస్తుంది.