శబరిమలలో మళ్ళీ తీవ్రమైన ఆందోళన! ఆలయ ప్రవేశానికి అంగీకారం  

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అంగీకారం తెలియజేసిన ఆలయ కమిటీ, సుప్రీం కోర్ట్ తీర్పుని అమలు చేయడానికి రెడీ అవుతున్న కేరళ ప్రభుత్వం.

కేరళలో శబరిమరట్ల ఆలయంలో మహిళల ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ గతంలో సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పడం జరిగింది. అయితే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి హిందుత్వ వాదులు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేయడం. శబరిమలలో అయ్యప్పని దర్శించుకోవడానికి వచ్చిన మహిళలని అడ్డుకోవడం జరుగుతుంది. చాలా జరుగుతుంది. ఇప్పటికే సుప్రీం కోర్ట్ తీర్పుని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్ట్ తీర్పుని అమలు చేయడానికి రెడీ అవుతూ పెద్ద ఎత్తున రక్షణ దళాలని మొహరించి, మహిళలని శబరిమల దర్శనంకి పంపించడానికి రెడీ అవుతున్నారు.

తాజాగా శబరిమల ఆలయ కమిటీ కూడా మహిళా ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో తాజాగా శబరిమలలో మహిళలని దర్శనం కి ప్రవేశ పెట్టాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దీంతో మరో సారి శబరిమల ఆలయం వద్ద హిదుత్వ సంఘాలు, భక్తుల ఆందోళన తీవ్రతరం అయ్యింది. అయితే ఎత్తి పరిస్థితిలో ఈ సారి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయ్యప్ప దర్శనం కి మహిళలని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. అయితే ఆలయ కమిటీ అయిన ట్రావెన్ కోర్ వారు మహిళల ప్రవేశానికి అవకాశం కల్పించిన భక్తుల మనోభావాలని కించపరిచే ఈ చర్యలకి మద్దతు తెలియజేసే అవకాశం లేదని, ఆలయంలోకి మహిళలని పంపించడానికి ఎ మాత్రం అవకాశం ఇవ్వమని హిదుత్వ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరి ఈ రోజు శబరిమల ఆలయం వద్ద పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.