టీటీడీ తరహాలో ఇకమీదట ఆన్లైన్లో శబరిమల అయ్యప్పస్వామి దర్శన టికెట్స్..!

Sabarimala Ayyappaswamy Darshan Tickets Online Like Ttd From Now On

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి ప్రతి యేటా లక్షల సంఖ్యలో స్వాములు మాలలు వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తారు.అయ్యప్ప భక్తులతో కేరళ రాష్ట్రంలోని శబరిగిరులలో స్వామియే శరణం అయ్యప్ప అనే మాట మారుమ్రోగిపోతుంది.

 Sabarimala Ayyappaswamy Darshan Tickets Online Like Ttd From Now On-TeluguStop.com

సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మండలం-మకరవిళక్కు సీజన్‌ లో శబరిమలకు ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటక, తమిళనాడుల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు.అయ్యప్ప స్వామి మాల వేసుకున్న అయ్యప్పలు అత్యంత భక్తి శ్రద్దలతో, నియమ నిబంధనలతో దీక్షను పాటిస్తారు.

అయితే ప్రస్తుత కాలంలో కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందులాగా లక్షల సంఖ్యలో భక్తులు కేరళకు వెళ్లడం లేదు.అలాగే కోవిడ్-19 వ్యాప్తిని నివారించే క్రమంలో కేరళ ప్రభుత్వం కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది.

 Sabarimala Ayyappaswamy Darshan Tickets Online Like Ttd From Now On-టీటీడీ తరహాలో ఇకమీదట ఆన్లైన్లో శబరిమల అయ్యప్పస్వామి దర్శన టికెట్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులను నియంత్రించడానికి దేవస్థానం బోర్డు అధికారులు ఇప్పుడు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.తిరుమలలో వెలిసిన శ్రీవారి దర్శన కోసం ఎలాగయితే ముందుగానే ఆన్‌లైన్ ద్వారా అడ్వాన్స్డ్‌గా టికెట్లను బుక్ చేసుకుంటామో సరిగ్గా అలాగే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలంటే ముందుగా ఆన్‌లైన్ లో టికెట్ బుకింగ్ చేసుకునే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు దేవస్దానం బోర్డు అధికారులు.

కోవిడ్ దృష్ట్యా వర్చువల్ క్యూ లైన్ విధానాన్ని అమలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఆ విధానాన్ని మళ్ళీ సరళీకరించారు అధికారులు.కాగా ఎలా ఆన్లైన్ లో టోకెట్స్ బుక్ చేసుకోవాలో అనే విషయంపై అవగాహన కల్పించే క్రమంలో తమ అధికార యూట్యూబ్‌లో రెండు వీడియోలను పోస్ట్ చేశారు.

Telugu Darshan, Latest News, Online Ticket, Sabarimala, Temple, Ttd-Latest News - Telugu

టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ క్రింది ఇవ్వబడిన లింక్స్ లో వీడియోలు చూస్తే భక్తులకు అర్ధం అవుతుంది.1)https://sabarimalaonline.org/#/loginhttps://sabarimalaonline.org/#/Videoguide

భక్తుల సౌకర్యార్ధం ఈ వీడియోలను మలయాళ, ఇంగ్లీష్ భాషలలో రూపొందించారు.ముందుగా

https://sabarimalaonline.org/#/Videoguide లింక్‌ను క్లిక్ చేయగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.ఆ తరువాత రిజిస్టర్ చేసుకోవాలి.అందులో అడిగిన విధంగా అన్ని వివరాలు పొందుపర్చాలి.ఫోటో గుర్తింపు కార్డు అనేది తప్పనిసరి.అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో ఈ మెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ కూడా పెట్టుకోవాలి.ఇప్పుడు మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది.

ఓటీపీ ఎంటర్ చేసాక మళ్ళీ అదే పోర్టల్ కి వెళ్లి లాగ్ ఇన్ అవ్వాలి.లాగ్ ఇన్ అయ్యాక లాగిన్ అయిన తరువాత ఎడమవైపు పైన చివరన ఉండే వర్చువల్-క్యూ అనే పదాలను క్లిక్ చేయగా సెల్ఫ్/కుటుంబం లేదా గ్రూప్ అనే పదాలు కనిపిస్తాయి.

మీరు ఎలా అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు టికెట్స్ బుక్ చేసుకోవాలి.

#Temple #Darshan #Sabarimala #Ticket

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube