ఏపీ సీ ఎస్ పై శాప్ మాజీ చైర్మన్ ఫిర్యాదు  

Saap Ex-chairman Complaint Against Ap C.s.-dgp Thakur,ex Chairman,mangalagiri,saap,ఎల్వీ సుబ్రహ్రహ్మణ్యం,డీజీపీ ఠాకూర్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్రహ్మణ్యం పై డీజీపీ కి ఫిర్యాదు అందింది. ఆయన సక్రమంగా విధులు నిర్వహించడం లేదంటూ డీజీపీ ఠాకూర్ కు శాప్ మాజీ చైర్మన్ పీ ఆర్ మోహన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం డీజీపీని కలిసిన ఆయన తన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయకుండా చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు..

ఏపీ సీ ఎస్ పై శాప్ మాజీ చైర్మన్ ఫిర్యాదు -SAAP Ex-Chairman Complaint Against AP C.S.

2015 జనవరి 28వ తేదీన ప్రభుత్వం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌)కు తనను ఛైర్మన్‌గా నియమిస్తూ శాప్‌కు ఉత్తర్వులు జారీ చేసిందని అయితే అప్పటి క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దానికి అనుబంధ ఉత్తర్వులు జారీ చేయలేదని పీ ఆర్ మోహన్ తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులనే నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన ఆయన ఎల్వీ పై చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదు లో కోరారు. దీనితో పీఆర్‌ మోహన్‌ చేసిన ఫిర్యాదుపై అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ ఠాకూర్‌ తిరుపతి అర్బన్‌ ఎస్పీని ఆదేశించినట్లు తెలుస్తుంది. మరోపక్క ఇటీవల ఏపీ సి ఎం చంద్రబాబు నాయుడు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కు పొసగడం లేదు అన్న విషయం తెలిసిందే.

కరక్ట్ గా ఎన్నికల ముందు ఏపీ సి ఎస్ ను ఉన్నట్టుండి మార్చడం తో ఏపీ సి ఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.