విక్రమ్, కీర్తి సురేష్ జంటగా నటించిన 'సామి 2' హిట్టా.? స్టోరీ..రివ్యూ అండ్ రేటింగ్..!     2018-09-21   10:01:35  IST  Sainath G

Movie Title; సామి 2

Cast & Crew:
న‌టీన‌టులు:విక్రమ్, కీర్తి సురేష్, ప్రభు, సూరి, ఐశ్వర్య రాజేష్, కోట శ్రీనివాస్ రావు తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: హరి
నిర్మాత‌: శిబూ తమీన్స్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

STORY:
సామి మొదటి పార్ట్ ఎండ్ అయిన దగ్గరనుండి ఈ సినిమా మొదలవుతుంది. ఆరు సామి ఒక ఇంటెలిజెంట్ కాప్..అతని మరణంతో ఈ సినిమా మొదలవుతుంది. ఆరు సామి హత్య వెనక మిస్టరీ ఛేదించటానికి అతని కొడుకు రామ సామి కాప్ గా ఛార్జ్ తీసుకుంటాడు. పెరుమాళ్ పిచాయ్ (కోట శ్రీనివాస్ రావు) ని ఆరు సామి మొదటి పార్ట్ లో చంపేస్తాడు. అతని కొడుకు రావణ పిచాయ్ ఆరు సామి కొడుకుని చంపాలనుకుంటు ఉంటాడు. చివరికి రామ సామి తన తండ్రి మరణంపై కారణం అయిన వారిని ఎలా హతమార్చాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

REVIEW:
2003 లో రిలీజ్ అయిన సామి కి సీక్వెల్ సామి 2 . సింగం దర్శకుడు హరి ఈ సినిమాను తెరకెక్కించాడు. రెండు పార్ట్శ్ లో విక్రమ్ కి ఒకే రకమైన గెటప్ వేశారు. భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలైంది కానీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. సామి లో ఉన్న స్టోరీనే ఇందులో కొనసాగించారు. కొంచెం కూడా కొత్తగా తీయలేదు. ఇందులో కీర్తి సురేష్ కేవలం పాటలకు, విక్రమ్ తో రొమాన్స్ సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. కాస్టింగ్ కి సరిగా ఉపయోగించుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఆడియన్స్ ని బోర్ కొట్టించాయి. కామెడీ కూడా పాత సినిమాల్లో ఉన్న కామెడీ స్టైల్ లో ఉంది. మొత్తానికి ఈ సినిమా చూడకపోవడమే బెటర్.

Saamy 2 Movie Telugu Review-Saamy 2 Movie Collections,Saamy 2 Movie First Day Talk,Saamy 2 Movie Telugu Review,Virkam

Plus points:
హీరో హీరోయిన్ రొమాన్స్
ఆక్షన్ సీన్స్
కామెడీ

Minus points:
స్క్రీన్ ప్లే
స్టోరీ
సాంగ్స్

Final Verdict:
సామి 2 …భారీ అంచనాలతో ప్రేక్షకులముందుకు వచ్చి అట్టర్ ప్లాప్ అయిన సినిమా

Rating: 1.5 / 5