ఈ యంగ్ బ్యూటీ ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడిందటగా....

తెలుగులో యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “సాహో” చిత్రంలోని “బ్యాడ్ బాయ్” స్పెషల్ పాటలో నటించి తన అందాల ఆరబోతతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన శ్రీలంకన్ బ్యూటీ “జాక్వెలిన్ ఫెర్నాండేజ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు స్వతహాగా శ్రీలంక దేశానికి చెందిన సిటిజన్ అయినప్పటికీ భారతదేశంలో పలు సినిమాలకి సంబంధించిన కోర్సులు మరియు మోడలింగ్ రంగంలో పని చేయడంతో గత కొద్దికాలంగా ముంబైలో ఉంటోంది.

 Saaho Movie Fame Jacqueline Fernandez Dating News Viral-TeluguStop.com

అయితే తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ విషయం ఏమిటంటే గత కొద్ది కాలంగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకి చెందినటువంటి ఓ ప్రముఖ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ సినీ టౌన్ తెగ చర్చించుకుంటున్నారు.

 Saaho Movie Fame Jacqueline Fernandez Dating News Viral-ఈ యంగ్ బ్యూటీ ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడిందటగా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా ఇటీవలే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి తన ప్రియుడు ముంబై పరిసర ప్రాంతంలో ఖరీదైన ఇల్లుని కొనిచ్చాడని దీంతో గత కొద్ది కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని కూడా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటి వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రం తన ప్రేమ మరియు డేటింగ్ ఈ విషయంపై వినిపిస్తున్న వార్తలు గురించి అసలు స్పందించడం లేదు.

దీంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అభిమానులు మాత్రం తన ప్రియుడి గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు.

Telugu Bollywood, Bollywood Heroine, Jacqueline Fernandez, Jacqueline Fernandez Love And Dating, Mumbai, Prabhas, Saaho Movie Fame Jacqueline Fernandez Dating News Viral, Saho-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ లో దాదాపుగా 5 చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఇటీవలే టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులను తాత్కాలికంగా కొంతకాలం పాటు నిలిపివేసినట్లు సమాచారం.

 

#SaahoMovie #Prabhas #Saho #Mumbai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు