ప్రేయసిని పెళ్లాడిన సాహో దర్శకుడు  

Saaho director Sujeeth got married to Pravallika Reddy, Lucifer movie, Megastar chiranjeevi, UV Creations, Darling Prabhas - Telugu Darling Prabhas, Lucifer Movie, Megastar Chiranjeevi, Saaho Director Sujeeth Got Married To Pravallika Reddy, Uv Creations

ఈ ఏడాది టాలీవుడ్ లో ఎక్కువ మంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.ఇప్పటికే నిఖిల్, నితిన్ పెళ్లి చేసుకోగా, రానా కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నాడు.

 Saaho Director Sujeeth Got Married To Pravallika Reddy

అలాగే మెగా ఫ్యామిలీలో కూడా నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఘడియలు సమీపించాయి.ఈ నెలలోనే ఆమె నిశ్చితార్ధం జరగనుంది.

ఇక తాజాగా దర్శకుడు సుజిత్ కూడా పెళ్లి పీటలు ఎక్కాడు.తాను ప్రేమించిన అమ్మాయి అయిన ప్రవల్లికని కుటుంబ సభ్యుల సమక్షంలో తక్కువ మంది బంధువుల మధ్య పెళ్లి చేసుకున్నాడు.

ప్రేయసిని పెళ్లాడిన సాహో దర్శకుడు-Movie-Telugu Tollywood Photo Image

కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో పెళ్ళికి చాలా కొద్దిమంది హాజరైనట్లు సమాచారం.కొంత కాలంగా సుజీత్, ప్రవల్లిక ప్రేమలో ఉన్నారు.

వీరి పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో కొద్దిరోజుల క్రితం నిశ్చితార్థం జరిపారు.నేడు వీరి వివాహం జరిగింది.

ఇదిలా ఉంటే ప్రభాస్ కి సాహో లాంటి పాన్ ఇండియా సినిమా ఇచ్చిన సుజిత్ కి ఆ సినిమా చేదు ఫలితం అందించింది.అయిన కూడా టేకింగ్, టెక్నికల్ ప్రెజెంటేషన్ విషయంలో దర్శకుడుగా మంచి మార్కులు వేయించుకున్నాడు.

ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న మలయాళీ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ బాధ్యతలని సుజిత్ కి అప్పగించారు.వచ్చే ఏడాది ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

దీంతో పాటు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గోపీచంద్, శర్వానంద్ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశం కూడా సుజిత్ కి లభించినట్లు తెలుస్తుంది.ప్రభాస్ దగ్గరుండి ఈ అవకాశం సుజిత్ కి ఇప్పటిన్చినట్లు సమాచారం.

మొత్తానికి సాహో ఎవరేజ్ అయిన రెండు భారీ ప్రాజెక్ట్ లకి దర్శకత్వం వహించే అవకాశం ప్రభాస్ కారణంగా సుజిత్ కి లభించింది అని చెప్పాలి.

#Darling Prabhas #SaahoDirector #UV Creations

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Saaho Director Sujeeth Got Married To Pravallika Reddy Related Telugu News,Photos/Pics,Images..