విమానం మొత్తానికి ఒకే ఒక్కడు..మొదట ఆందోళనకి తర్వాత..ఆనందం

ఎప్పుడన్నా బస్ ఎక్కినప్పుడు బస్ లో డ్రైవర్,కండక్టర్,మీరు తప్ప ఎవరూ లేకపోతేనే ఆ ప్రయాణం చాలా థ్రిల్ గా అనిపిస్తుంది.అంత పెద్ద బస్లో మనమొక్కరమే ఆహా,ఏమి రాజభోగమూ అనుకుంటాం కదా.

 Saad Jilani Got The Ultimate Private Jet Experience-TeluguStop.com

అదే ఎయిర్ బస్లో మనమొక్కరమే ప్రయాణం చేస్తే ఇంకెంత థ్రిల్ ఉంటుంది.అలాంటి ప్రయాణమే చేశాడు .ఒక వ్యక్తి.విమానమే ఎక్కడమే గొప్పగా ఫీల్ అవుతుంటాం.అలాంటిది ఒక్కరమే ప్రయాణం చేయడం అంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో ఊహించుకోండి…

సాద్ జిలానీ అనే వ్యక్తి కోర్ఫూ నుంచి బ్రిమ్మింగ్హామ్‌కు ఓ ప్రైవేట్ బోయింగ్ 738 విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు.ప్రయాణం చేయాల్సిన రోజున విమానం ఎక్కాడు.లోపలికి వెళ్లి చూస్తే ఆ విమానంలో సిబ్బంది తప్ప ఇంకెవరూ లేరు.జెట్ లో ఉన్న మొత్తం 168 సీట్లు ఖాళీగా ఉన్నాయి.విమానం బయలుదేరేందుకు ఇంకా సమయం ఉందికదా వస్తారులే అనుకొని తన సీటులోకి వెళ్లి కూర్చున్నాడు.విమానం కదిలేందుకు సమయం దగ్గర పడుతోంది.

అయినా ఒక్క ప్రయాణికుడు కూడా రాలేదు.ఇక ఎయిర్ హోస్టెస్‌లు తమ జాగ్రత్తలు చెబుతున్నారు.

మరికాసేపట్లో విమానం టేకాఫ్ తీసుకుంటుందని కాక్పిట్ (పైలట్ క్యాబిన్) నుంచి ప్రకటన వచ్చేసింది.ఇంకా ప్రయాణికులు ఎవరూ రాకపోవడంతో ఉండబట్టలేక సిబ్బందిని ఆరా తీసాడు.

విమానంలో మీరు తప్ప మరో ప్రయాణికుడు లేరని సమాధానం రావడంతో… జిలానీ మొదట ఆందోళనకి తర్వాత… ఆనందానికి గురయ్యాడు.విమానం తనదే అన్నట్టు ఒక్కడే విమానం మొత్తం కలియతిరిగాడు.అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు కూర్చుంటూ టైంపాస్ చేశాడు.అంతేకాడు సిబ్బందితో ఎంచక్కా కబుర్లు చెప్పాడు, సెల్ఫీలు దిగాడు.సాధారణంగా ప్రయాణికుడిని కాక్పిట్లోకి అనుమతించరు.కానీ జిలానికి ఏకంగా పైలట్ సీటులో కూర్చొనే అవకాశం దక్కింది.

మొత్తం రెండున్నర గంటలపాటు సాగిన ఈ ప్రయాణంలో అనుభవించు రాజా అనుకుంటూ గడిపేసాడు… ఇలాంటి అవకాశం ఎవరికో కాని రాదు.జిలానిని చూసినవారు,ఈ విషయం తెలిసిన వారు నువ్ నిజంగా అదృష్టవంతుడివి అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

నిజమే కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube