సరిగమప షో.. అతనిపై సింగర్ పార్వతి సెటైర్లు.. వైరల్ అవుతున్న వీడియో!

తెలుగు బుల్లితెర పై ఎన్నో రకాల పాటల షోలు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.అయితే రాబోయే తరానికి మంచి మంచి సింగర్లను అందించడం కోసం ఇప్పటికే పలు రకాల షోలు రెండు తెలుగు రాష్ట్రాలను జల్లెడ పట్టి మంచి మంచి సింగర్లను ఎంచుకొని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

 Sa Re Ga Ma Pa Finalists Special Interview, Tollywood, Sa Re Ga Ma Pa Finalists-TeluguStop.com

కాగా ఇప్పటికే ఈ పాటల ప్రోగ్రాంల ద్వారా ఎంతోమంది సింగర్లు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.అలా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న పాటల ప్రోగ్రాంలలో జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ షో కూడా ఒకటి.

అయితే ఇటీవలే ప్రారంభమైన ఈ షో ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే భారీగా క్రేజ్ ను సంపాదించుకుంది.అదేవిధంగా మరొకవైపు టిఆర్పి రేటింగ్ విషయంలో కూడా దూసుకెళ్తోంది.

ఇదిలా ఉంటే ఈ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ షో గ్రాండ్ ఫినాలే కు సర్వం సిద్ధం అయ్యింది.

ఈ గ్రాండ్ ఫినాలేదో పాటిస్పేట్ చేయడం కోసం ప్రస్తుతం 8 మంది కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారు.సింగర్స్‌ ప్రణవ్‌, పార్వతి, అభినవ్‌, శృతిక, సుదాన్షు, డేనియల్‌, చరణ్‌, శివాణి టైటిల్‌ రేసులో ఉన్నారు.

కాగా ఈ 8 మందిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది చూడాల్సి ఉంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఫైనలిస్టులతో ఒక మీడియా ఛానల్ ముచ్చటించింది.ఈ క్రమంలోనే సరిగమప షోకి సంబంధించిన ఎన్నో విషయాలతో పాటుగా వారితో సరదాగా మాట్లాడారు.ముఖ్యంగా డేనియల్‌పై పార్వతి వేసే పంచులు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తున్నాయి.

ఇక శ్రీముఖి కోసం చరణ్‌ ఓ లవ్లీ సాంగ్‌ను డెడికేట్‌ చేశాడు.ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అయితే ఈ 8 మంది లో ఈసారి సరిగమప టైటిల్ విన్నర్ ఎవరు గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube