జార్జియాలో జైశంకర్ బిజిబిజీ.. మహాత్ముడి విగ్రహావిష్కరణ, ఇండియన్ కమ్యూనిటీతో భేటీ

రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జార్జియాలో బిజిబిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే జార్జియా విదేశాంగ మంత్రి డేవిడ్ జల్కాలియానితో కలిసి టిబిలిసి పార్క్‌లో ఏర్పాటు చేసిన భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు.

 S Jaishankar Unveils Mahatma Gandhi's Statue In Georgia, External Affairs Minist-TeluguStop.com

ఇందుకు సంబంధించిన ఫోటోలను జైశంకర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.అంతకుముందు రోజు ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సమావేశంలో భేటీ అయ్యారు.

ఆర్ధిక సహకారం, పర్యాటక రంగం, వాణిజ్యం, ఇరు దేశాల మధ్య అనుసంధానం గురించి చర్చించారు.అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ… ఇరు దేశాల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు.

జార్జియాలో కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు భారత్ చేపట్టిందని జైశంకర్ తెలిపారు.

అలాగే పర్యటన సందర్భంగా సెయింట్ క్వీన్ కేతేవన్ అవశేషాలను జైశంకర్ జార్జియా ప్రభుత్వానికి అందజేశారు.

క్వీన్ కేతేవన్ 17వ శతాబ్ధపు జార్జియా రాణి.ఆమె అమరురాలు.

పోర్చుగీసు రికార్డుల ప్రకారం.భారత్‌లోని ఓల్డ్ గోవాలో వున్న సెయింట్ అగస్టిన్ కాన్వెంట్‌లో ఆమె అవశేషాలను 2005లో కనుగొన్నారు.

Telugu Externalaffairs, Georgia, Mahatmagandhi, Mahatmagandhis-Telugu NRI

మరోవైపు జై శంకర్.జార్జియాలోని ప్రవాస భారతీయ సమాజాన్ని కలిశారు.త్నోరి, ఖాకేటి ప్రాంతానికి సంబంధించిన ఇండియన్ కమ్యూనిటీ ప్రతినిధులు కొందరు జై శంకర్‌‌తో శనివారం భేటీ అయ్యారు.అనంతరం దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కేంద్ర మంత్రి.

జార్జియాలో ఇండియన్ కమ్యూనిటీ ప్రతినిధులను కలవడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.వ్యవసాయ రంగంలో ఇక్కడి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

దీని ద్వారా ప్రవాసులు మంచి గుర్తింపు సంపాదించుకున్నారని జైశంకర్ ప్రశంసించారు.అంతేకాకుండా ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత దర్పన్ ప్రషెర్‌ను విదేశాంగ మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube