ఆర్ఎక్స్ 100 రీమేక్.. అంతకు మించి ఉంటుందట!

టాలీవుడ్‌లో తెరకెక్కిన బోల్డ్ లవ్ స్టోరీ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో హీరోగా కార్తికేయ, హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ అదిరిపోయే ఇమేజ్‌లను సొంతం చేసుకున్నారు.

 Rx100 Remake To Be More Bold-TeluguStop.com

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత ఓ రేంజ్‌లో ఉండటం, బోల్డ్ కంటెంట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూపెట్టిన విధానం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

ఇక ఆర్ఎక్స్ 100 చిత్రం ఇప్పటికీ తన మార్క్‌ను వేసుకుని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.అయితే ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

 Rx100 Remake To Be More Bold-ఆర్ఎక్స్ 100 రీమేక్.. అంతకు మించి ఉంటుందట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా ఆర్ఎక్స్100 చిత్ర హిందీ రీమేక్‌పై అందరి దృష్టి పడింది.ఈ సినిమాతో హిందీలో హీరో సునీల్ శెట్టి కొడుకు ఆహాన్ శెట్టి హీరోగా పరిచయం అవుతున్నాడు.

కాగా హీరోయిన్‌గా తారా సుల్తారియా అందాల సెగలు పుట్టించనుంది.అయితే తెలుగులో ఆర్ఎక్స్ 100 ఎంత బోల్డ్‌గా ఉందో, అంతకు మించిన బోల్డ్ సీన్స్ ఈ రీమేక్ సినిమాలో ఉండబోతున్నాయట.

ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్‌కు కుర్రకారు పిచ్చోళ్లు కావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

సాజిద్ నడియాడ్‌వాలా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తుండగా మిలన్ లుథారియా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా తెలుగులో సాధించిన ఘన విజాయన్ని మించిన విజయం బాలీవుడ్‌లో సాధిస్తుందని చిత్ర యూనిట్ పూర్తి ధీమాగా ఉన్నారు.మరి ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్‌లో ఎలాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయో, అవి కుర్రకారును ఏ విధంగా ఆకట్టుకుంటాయో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

కాగా ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#Payal Rajput #Karthikeya #Rx

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు