నటి ఆత్మహత్య కేసు: పరారీ లో ఉన్నఆర్ఎక్స్ 100 నిర్మాత!  

Serial actress Sravani suicide case police searching for Producer Ashok reddy, RX100 Producer Ashok reddy, Serial actress Sravani,Suicide, Sai Krishna Reddy, Rdevraj - Telugu Rdevraj, Rx100 Producer Ashok Reddy, Sai Krishna Reddy, Serial Actress Sravani, Serial Actress Sravani Suicide Case Police Searching For Producer Ashok Reddy, Suicide

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నా సంగతి తెలిసిందే.నటి ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ముగ్గురిని నిందితులుగా గుర్తించిన అధికారులు ఇద్దరినీ మాత్రం కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

 Rx100 Producer Ashok Reddy Sravani Suicide Case

అయితే ఈ కేసుకు సంబంధించి RX 100 నిర్మాత అశోక్ రెడ్డి పాత్ర కూడా ఉంది అని గుర్తించిన పోలీసులు అతడిని విచారించేందుకు ప్రయత్నిస్తుండగా అతడు ప్రస్తుతం పరారీ లో ఉన్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయికృష్ణారెడ్డిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా,ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న అశోక్ రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఎస్సార్ నగర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

నటి ఆత్మహత్య కేసు: పరారీ లో ఉన్నఆర్ఎక్స్ 100 నిర్మాత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సోమవారం విచారణకు హాజరుకానున్నట్టు చెప్పినప్పటికీ, సెల్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు.

దీనితో అతడికోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.సినిమా రంగంలో అవకాశాల పేరుతో నటి శ్రావణితో అశోక్‌రెడ్డి దగ్గరయినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే శ్రావణికి దేవరాజ్ అనే వ్యక్తి దగ్గర కావడంతో తట్టుకోలేకపోయిన అశోక్‌రెడ్డి సాయికృష్ణ ద్వారా ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి వారిద్దరూ విడిపోయేలా చేశాడని సమాచారం.ఈ క్రమంలోనే ఈ నెల 7న అమీర్‌పేటలో ఓ హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ పడిన అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లగా, అప్పటికే అక్కడ అశోక్‌రెడ్డితో కలిసి శ్రావణిపై దాడిచేసినట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించి పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది.

ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించడం తో ప్రస్తుతం అతడిని గాలించే పనిలో పడ్డారు పోలీసులు.

#Suicide #SerialActress #Rdevraj #RX100Producer #SerialActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rx100 Producer Ashok Reddy Sravani Suicide Case Related Telugu News,Photos/Pics,Images..