అలాంటి కథలతో నా దగ్గరకి రావొద్దు... తెగేసి చెప్పిన పాయల్

పాయల్ రాజ్ పుత్ అంటే అందరికి వెంటనే ఆర్ ఎక్స్ 100 సినిమా గుర్తుకొస్తుంది.ఆ సినిమాలో ప్రేమించిన వాడిని మోసం చేసిన ప్రియురాలి పాత్రలో మెప్పించింది.

 Rx100 Payal Rajput Venky Mama Chaithu Venkatesh-TeluguStop.com

అయితే ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ నటన కంటే, ఆమె చేసిన బోల్డ్, ఎక్స్ పోజింగ్, కుర్రకారుకి భాగా కనెక్ట్ అయ్యింది.సినిమాలో పాయల్ రాజ్ పుత్ యాటిట్యూడ్, లుక్స్ విపరీతంగా అందరికి కనెక్ట్ అయ్యాయి.

తరువాత ఆమెని మామూలు పాత్రలో చూడటానికి కూడా తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదు.ఇదిలా ఉంటే ఇక దర్శక, నిర్మాతలు కూడా ఆర్ ఎక్స్ 100 లో చేసినటువంటి బోల్డ్ పాత్రలతోనే పాయల్ రాజ్ పుత్ దగ్గరకి స్క్రిప్ట్ లు పట్టుకొని వెళ్ళారు.

అదే కోవలో సి కళ్యాణ్ కి ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమాని పాయల్ చేసిన అది అస్సలు వర్క్ ఔట్ అవ్వలేదు.

ఇదిలా ఉంటే తాజాగా వెంకీమామా సినిమాతో పాయల ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా నటించిన ఈ భామ హిందీ టీచర్ పాత్రలో ఫుల్ ఫన్ చేసింది.ఈ పాత్రతో ఇప్పటి వరకు తనపై ఉన్న బోల్డ్ యాక్టర్ అనే ముద్రని పాయల్ చేరిపెసుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజకి జోడీగా డిస్కో రాజా సినిమాతో సందడి చేయబోతుంది.ఈ సినిమా హిట్ అయితే ఆమె రేంజ్ కూడా మారిపోతుంది.ఈ నేపధ్యంలో బోల్డ్ పాత్రలతో తన దగ్గరకి రావొద్దని పాయల్ రాజ్ పుత్ దర్శకులకి, నిర్మాతలకి క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తుంది.అలాంటి కథలు తీసుకొని వచ్చిన కూడా తాను వినే పరిస్థితి లేదని తేల్చి చెప్పెసినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube