ఆర్‌ఎక్స్‌ 100 హీరోయిన్‌కు కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం     2018-07-25   11:31:59  IST  Ramesh Palla

తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల సినీ పరిశ్రమల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమాయకపు అమ్మాయిలు, అవకాశం కోసం చూసే హీరోయిన్స్‌ను కొందరు వలలో వేసుకోవడం చాలా కామన్‌ అంటూ ఇండస్ట్రీకి చెందిన వారే చెబుతున్నారు. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్స్‌గా వెలుగు వెలుగుతున్న వారు కూడా గతంలో కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నాం అంటూ చెబుతున్నారు. సీనియర్‌ హీరోయిన్స్‌ కూడా కాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలోనే ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన పాయల్‌ కూడా కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది.

హీరోయిన్‌గా చేయానే కోరికతో చాలా ప్రయత్నాలు చేశాను. ఆ సమయంలోనే కొందరు చెప్పినట్లు చేస్తే అవకాశాలు వస్తాయని చెప్పారు. కాని తాను అందుకు ఒప్పుకోలేదు. మరి కొందరు అయితే ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించారు, కొందరు ఏకంగా ఆఫర్‌ అయినా డబ్బులు అయినా ఇస్తాం తాము చెప్పినట్లుగా చేయాలి అంటూ నా వద్దకు వచ్చారు అంటూ పాయల్‌ చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే నా వద్దకు దర్శకుడు అజయ్‌ భూపతి వచ్చారు. ఆయన వద్ద ఉన్న కథకు తాను అయితే బాగా సూట్‌ అవుతాను అని ఆయన నమ్మాడు.

RX100 Movie Heroine Facing Casting Couh Probelms-

RX100 Movie Heroine Facing Casting Couh Probelms

కథ చెప్పిన సమయంలోనే ముద్దు సీన్స్‌ ఉంటాయి, కాస్త బోల్డ్‌గా నటించాలి, నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అంటూ చెప్పాడు. అన్ని ఓకే కాని ముద్దు సీన్స్‌ అంటేనే కాస్త టెన్షన్‌ పడ్డాను. అయితే సినిమాల్లో ఆఫర్‌ రావడమే గొప్ప అనుకుంటున్న సమయంలో ఇలాంటి చిన్న విషయాలకు ఆ అవకాశాన్ని వదులుకోవడం పెద్ద తప్పు అవుతుందనిపించింది. ఈ సీన్స్‌కు ఒప్పుకోకుంటే ముందు ముందు మరెంతగా బలి అవ్వాల్సి వస్తుందో అనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీకి రావాలనుకునే అమ్మాయిలు కాస్త ఓపిక పడితే తప్పకుండా ఆఫర్లు వస్తాయి. కాస్టింగ్‌ కౌచ్‌కు బలి అయితే ఆఫర్లు రావచ్చు రాకపోవచ్చు అంటూ సలహా ఇచ్చింది. ఇక ఈమె రెండవ సినిమా అప్పుడే ఫిక్స్‌ అయినట్లుగా తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో ఒక హీరోయిన్‌గా ఈ అమ్మడిని ఎంపిక చేశారట. ఇంకా మెగా మూవీలో కూడా ఈమెకు ఛాన్స్‌ దక్కనుందని తెలుస్తోంది. మొత్తానికి ముద్దు సీన్స్‌కు హద్దులు పెట్టకుండా నటించినందుకు పాయల్‌కు మంచి విజయం దక్కింది. ఆ విజయం ఇప్పుడు ఆమెను మోస్ట్‌ వాంటెడ్‌ చేసింది.