18 ఏళ్లకే ఆ అమ్మాయి కోసం గుండు కొట్టించుకున్నాడు... చివరికి?

ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.అమ్మాయి ఏం కోరితే అది తీసుకురావడానికి ఎంత కష్టమైనా భరిస్తారు.

 Hero Karthikeya Real Life Love Story, Karthikeya Lover, Rx100 Movie, Yamaha Rx10-TeluguStop.com

తన ఇష్ట పడిన అమ్మాయి కి ఆరోగ్యం బాగా లేకపోతే ఆ వెంకటేశ్వరస్వామి మొక్కి, ఆ అమ్మాయి కి ఆరోగ్యం కుదుటపడితే గుండు చేయించుకుంటానని పద్దెనిమిదేళ్ల కుర్రాడు మొక్కుకున్నాడు.ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అతనే కార్తికేయ గుమ్మకొండ ఆర్ఎక్స్ 100 ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ యువ నటుడు సిని ప్రస్థానం ఏమిటో ఇక్కడ చూద్దాం.
సినీ ప్రపంచంతో సంబంధం లేని కుటుంబం కేవలం చదువు ప్రాధాన్యమిచ్చే ఆ కుటుంబంలో నుంచి వచ్చిన ఈ యువ హీరో ఇంటర్ చదువుతున్నప్పుడు పంజాబీ అమ్మాయిను బాగా ఇష్టపడే వాడు.తన ధ్యాసలో పడి పరీక్షలు పై పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు.

కానీ కొద్దిరోజులకు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.తన 18 వ ఏట తనకు బాగా ఇష్టమైన అమ్మాయికి ఆరోగ్యం బాగా లేకపోతే తనకు ఆరోగ్యం కుదట పడితే గుండు చేయించుకుంటానని , మొక్కుకున్నాడు.

అయితే ఆ అమ్మాయి ఆరోగ్యం ఒక వారంలో కుదట పడగానే ఈ యువ హీరో తిరుపతి వెళ్లి గుండు చేయించుకుని వచ్చాడు.అయితే తన తల్లిదండ్రులు మాత్రం మా అబ్బాయికి ఎంతో భక్తి అని తెగ సంబరపడిపోయారు.
ఇంజనీరింగ్ చదువుతూ తనకు సినిమాలపై ఉన్న ఆశక్తితో యాక్టింగ్ చేస్తూ, షార్ట్ ఫిలింలో నటిస్తూ సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో తన తల్లిదండ్రులు నిర్మాతలుగా మరి సొంత బ్యానర్లో ‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమా చేశారు.ఈ సినిమా పెద్ద హిట్ కాకపోవడంతో ఆ సినిమాకి టెక్నీషియన్ గా పనిచేసిన ఒక వ్యక్తి నాకు అజయ్ భూపతి ను పరిచయం చేశాడు.

అప్పటికే ఆర్ఎక్స్ 100 సినిమా కథతో రెడీగా ఉన్న అతను హీరోగా సెలెక్ట్ చేశాడు.కానీ ఆ సినిమా నిర్మించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇద్దరం కలిసి నిర్మాతలకు కథ వినిపించాను.

కానీ సినిమా నిర్మించడానికి ఎవరు ముందుకు రాలేదు.

ఆ సమయంలో కార్తికేయ అక్క కల్పించుకొని ఈ సినిమాని మనమే చేద్దామని వాళ్ల అమ్మ నాన్నల ఒప్పించడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.

అయితే సినిమాకి ఆర్ఎక్స్ 100 ని పేరు పెట్టడానికి జపాన్ లోని యమహా ఆర్ఎక్స్ 100 కంపెనీ పర్మిషన్ కోసం వారికి మెయిల్ చేయగా వారు కూడా తొందరగా ఒప్పుకున్నారు.దీంతో షూటింగ్ పనులు ప్రారంభించారు.

అప్పటివరకు బైక్ నడపడం రాని కార్తికేయ ఈ సినిమా కోసం బైక్ నడపడం నేర్చుకున్నాడు.

చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఎవరూ ఊహించనటువంటి కలెక్షన్లను రాబట్టింది.

దీంతో ఒక్కసారిగా కార్తికేయకు అవకాశాలు వచ్చాయి.హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్ మొదలైన సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ పతాకంపై ‘చావు కబురు చల్లగా’ లో శవ యాత్ర వాహనం డ్రైవర్ గా ఎంతో కీలకమైన పాత్రలో కార్తికేయ నటిస్తున్నాడని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube