బిగ్ ‌బాస్ ‌లో RX 100 జంట సందడి చేయబోతుందా..?!  

బిగ్ ‌బాస్ ‌లో RX 100 జంట సందడి చేయబోతుందా..?! - Telugu Bigg Boss 4, Dasara Festival Special, Elimination, Hero Kartikeya, Heroin Payal Rajputh, Samantha As Host

దసరా పండుగ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ 4 సీజన్ లో ఇద్దరు సెలబ్రిటీలు అడుగు పెడుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం హోస్ట్ నాగార్జున వారాంతపు షూట్ కు గైర్హాజరు కావడంతో ఆయన స్థానంలో ఆయన కోడలు అక్కినేని సమంత వేదికపైన కనబడుతోంది.

TeluguStop.com - బిగ్ ‌బాస్ ‌లో Rx 100 జంట సందడి చేయబోతుందా..?!

అయితే ఈ క్రమంలోనే ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి చేయబోతున్నట్లు సమాచారం.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

కరోనా వైరస్ తీవ్రత మొదలు కాక ముందు ఎన్నో సినీ అవార్డులు, అలాగే ప్రత్యేక వేడుకల వేదికపై తన డాన్సులతో రెచ్చిపోయిన కార్తికేయ మరోసారి తన ప్రతిభను చాటుకునేందుకు బిగ్ బాస్ వేదికను మార్చుకోబోతున్నాడు.

TeluguStop.com - బిగ్ ‌బాస్ ‌లో RX 100 జంట సందడి చేయబోతుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దసరా తో పాటు వీకెండ్ సెలబ్రేషన్స్ లో పాలుపంచుకోవాలని ఆయనను బిగ్ బాస్ టీం సంప్రదించగా అందుకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.ఇందులో భాగంగానే కార్తికేయ బిగ్ బాస్ స్టేజిపై ఏకంగా ఎనిమిది నిమిషాల పాటు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సెలబ్రిటీలతో కార్తికేయ ముచ్చట్లు చెప్పనున్నాడు.అలా వారందరితో మాట్లాడిన తర్వాత కార్తికేయ టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు చెప్పి షో నుండి వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేశారని సమాచారం.

ఇక ఆ తర్వాత కార్తికేయతోపాటు ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా బిగ్ బాస్ ప్రేక్షకులకు అలాగే హౌస్ మెంట్స్ కు సప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.ఈవిడ కూడా బిగ్ బాస్ స్టేజ్ పై తన అందాలను ఆరబోస్తూ ఫర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో మాత్రం నేటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.ఇకపోతే ఈ వారాంతంలో వచ్చే ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదనే విషయం అర్థమవుతోంది.

ఇకపోతే ఈ వారం ఎలిమినేట్ చేయకుండా వచ్చే వారంలో మాత్రం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ చేస్తారనే విషయం ఇప్పుడు ప్రేక్షకుల్లో చర్చనీయాంశమైంది.

#HeroinPayal #DasaraFestival #Hero Kartikeya #Bigg Boss 4 #Elimination

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

బిగ్ ‌బాస్ ‌లో Rx 100 జంట సందడి చేయబోతుందా..?! Related Telugu News,Photos/Pics,Images..