బాలయ్యతో రొమాన్స్ చేస్తున్న ఆర్ ఎక్స్ 100 భామ  

Payal Rajput Romance With Balayya-

ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన హాట్ ముద్దుగుమ్మ, పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్.ఈ భామ మొదటి సినిమాతో అటు నటిగా, ఇటు గ్లామర్ క్వీన్ గా తన సత్తా చూపించడంతో ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది.ఇప్పటికే డిస్కో రాజా సినిమాతో రవితేజగా జోడీగా నటిస్తున్న ఈ భామ మరో వైపు, లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా చేస్తుంది.అలాగే మన్మధుడు సీక్వెల్ లో నాగార్జున కి జోడీగా నటిస్తుంది...

Payal Rajput Romance With Balayya--Payal Rajput Romance With Balayya-

అలాగే వెంకి మామా సినిమాలో వెంకటేష్ తో జత కడుతుంది.ఇలా వరుసగా అందరూ ముదురు హీరోలతో అవకాశాలు అందుకుంటున్న ఈ భామకి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది.

బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

Payal Rajput Romance With Balayya--Payal Rajput Romance With Balayya-

ఇటీవలే ఈ సినిమా ప్రారంభం అయ్యింది.త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి నిర్మాత సి.కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు.పోలీస్ ఆఫీసర్ గా .గ్యాంగ్ స్టార్ గా ఆయన రెండు పాత్రలను చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం వుంటుందనే టాక్ వినిపిస్తుంది.ఇందులో ఒక హీరోయిన్ బోల్డ్ గా కనిపించాల్సి ఉంది.

ఈ నేపధ్యంలో నిర్మాత సి కళ్యాణ్ ఆ పాత్ర కోసం పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారని తెలుస్తుంది.త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.మొత్తానికి ఒక్క సినిమా సక్సెస్ తో ఏకంగా సీనియర్ హీరోలతో జత కట్టే అవకాశం టాలీవుడ్ లో పాయల్ కి మాత్రమే వచ్చింది అని చెప్పాలి.