బోల్డ్ ప్రేమకథకు సీక్వెల్ రెడీ చేస్తున్న డైరెక్టర్

టాలీవుడ్‌లో బోల్డ్ కంటెంట్ సినిమాలకు ఎలాంటి ఆదరణ ఉంటుందో మనం చాలా సార్లు చూశాం.అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ కంటెంట్ సినిమాలకు సరికొత్త ట్రెండ్ క్రియేట్ అయ్యింది.

 Rx100 Ajay Bhupathi-TeluguStop.com

ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మరో బోల్డ్ కంటెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా ఆర్ఎక్స్100.

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కల్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకులను ముఖ్యంగా యూత్‌ను ఎలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.

 Rx100 Ajay Bhupathi-బోల్డ్ ప్రేమకథకు సీక్వెల్ రెడీ చేస్తున్న డైరెక్టర్-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్ క్రియేట్ చేశారు చిత్ర యూనిట్.రొమాన్స్‌కు బోల్డ్‌ను యాడ్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు మళ్లీ మళ్లీ రప్పించాడు దర్శకుడు అజయ్ భూపతి.

ఇక హీరోహీరోయిన్లుగా కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ యాక్టింగ్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఈ సినిమా కంటెంట్ కల్ట్ సినిమా లవర్స్‌కు విపరీతంగా నచ్చడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే పనిలో పడ్డాడట చిత్ర దర్శకుడు.

కాగా ప్రస్తుతం మహాసముద్రం సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే పనిలోపడ్డ అజయ్ భూపతి, ఆ సినిమా పూర్తయ్యాక ఆర్ఎక్స్100 సీక్వెల్‌ను మొదలుపెట్టనున్నాడట.

#Ajay Bhupathi #Rx #Karthikeya #Payal Rajput

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు