తెలుగులో సూపర్ హిట్ అయిన Rx100 సినిమా తమిళ్ రీమేక్ లో నటించేది ఎవరో తెలుసా?     2018-08-19   12:02:54  IST  Sainath G

టాలీవుడ్ లో చిన్న సినిమాలకు ఇటీవల అందుతున్న క్రేజ్ మాములుగా లేదు. కంటెంట్ ఏ మాత్రం కొత్తగా ఉన్నా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టేస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాగా ఆర్ఎక్స్ 100 నిలిచింది. సినిమాలో మసాలా ఎక్కువైందని సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నప్పటికీ యూత్ మాత్రం సినిమాను తెగ చూసేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు పెట్టిన బడ్జెట్ కి డబుల్ షేర్స్ అందాయి. అయితే తన సినిమాపై వస్తున్న విమర్శల్ని తిప్పికొడుతున్నాడు దర్శకుడు.

RX100 మూవీలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోయటమే కాదు మతి పోయేలా లిప్ లాకులు చేసింది పాయల్ రాజపుత్. తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ ఉత్తరాది భామ టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అసలు ఈ సినిమా ట్రైలర్ తోనే ఆడియన్స్ పిచ్చెక్కి పోయారంటే అతిశయోక్తి కాదు.అర్జున్ రెడ్డి లో ఒకటి రెండు లిప్ లాకులకే అబ్బా అనుకున్నారు. RX100 మూవీలో మోతాదుకు మించిన సీనులతో పాయల్ రాజపుత్ రగిల్చిన వేడి అంతా ఇంతా కాదు. రివ్యూలలో సైతం పాయల్ కే మార్కులు వేస్తున్నారు సినీ క్రిటిక్స్. దాన్ని బట్టే అమ్మడు ఈ స్థాయిలో బోల్డ్ గా యాక్ట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

Rx 100 Movie Tamil Remake Heroine-Rx 100 Movie,Tamil Remake

తమిళ నేటివిటీకి కూడా ఈ చిత్రం బాగా సరిపోతుంది. అందుకే ఆర్ఎక్స్ 100 చిత్ర తమిళ రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొని ఉంది. ఔరా సినిమాస్ ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాప్సి ఆర్ఎక్స్ 100 తమిళ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. హీరోగా ఆది పినిశెట్టి నటించనున్నాడు. తాను ఆర్ఎక్స్ 100 చిత్రం చూశానని, ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధిస్తుందనే ధీమా ఉందని ఆది తెలిపాడు.